ETV Bharat / sports

ఆ రెండు దేశాల పతాకాలు ఒకటే.. కంగుతిన్న అథ్లెట్లు! - 1936 ఒలింపిక్స్

ఒలింపిక్స్​ పరేడ్​లో జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తుంటే అథ్లెట్లు, దేశ పౌరులు గర్వంగా ఉప్పొంగిపోతారు. మరి ఇలాంటి దేశ పతాకం ఓ రెండు దేశాలకు ఒకేలా ఉందని మీకు తెలుసా? ఎలాగా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.

national flag
ఒలింపిక్స్
author img

By

Published : Aug 5, 2021, 9:24 AM IST

వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్‌ మహా క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పాల్గొంటాయి. ఒలింపిక్స్‌ వేదికపై పరేడ్‌లో భాగంగా తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆయా దేశాల అథ్లెట్లు ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతారు. అయితే, 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో హైతీ, లీచెన్‌స్టైన్‌ దేశాలకు చెందిన అథ్లెట్లు పతాకాల ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకో తెలుసా? ఆ రెండు దేశాల జాతీయ పతాకాలు ఒకేలా ఉన్నాయి మరి.

national flag
లీచెన్‌స్టైన్‌, హైతీ పతాకాలు

ఇరు దేశాల పతాకాల్లో అడ్డంగా రెండు రంగుల చారలు(పైన నీలిరంగు, కింద ఎరుపు రంగు) మాత్రమే ఉన్నాయి. దీన్ని గమనించిన ఇరు దేశాలు భవిష్యత్తులో సమస్యలు తలెత్తొచ్చని భావించి పతాకాల్లో మార్పులు చేశాయి. లీచెన్‌స్టైన్‌ పతాకంలో పసుపు రంగులో కిరీటాన్ని జోడించారు. ప్రజలు.. ఆ దేశ రాజులకు మధ్య ఉన్న ఐక్యతకు గుర్తుగా ఈ కిరీటం చిహ్నాన్ని నీలిరంగు చారలో ఎడవైపు పైభాగాన పెట్టారు. ఇక హైతీ ప్రభుత్వమేమో కాలక్రమంలో ఒకసారి కాదు.. అనేక సార్లు పతాకాన్ని మార్చింది. ప్రస్తుతం నీలి, ఎరుపు రంగు చారల మధ్యలో కొబ్బరి చెట్లు.. దాని కింద ఆయుధాలు ఉన్న చిహ్నాన్ని ఉంచింది.

ఇదీ చూడండి: లవ్లీనాకు పతకం వచ్చే.. ఇంటికి రోడ్డు తెచ్చే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.