ETV Bharat / sports

Tokyo Paralympics: భారత్​కు తొలి పతకం ఖాయం చేసిన భవినా పటేల్ - Tokyo Paralympics

భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినాబెన్‌ పటేల్‌ అదరగొట్టింది. పారాలింపిక్స్‌ క్వార్టర్స్​లో అలవోకగా గెలిచి సెమీస్​కు దూసుకెళ్లిన తొలి భారత ప్యాడ్లర్​గా రికార్డుకెక్కింది.

Paddler Bhavina
భవినాబెన్‌ పటేల్‌
author img

By

Published : Aug 27, 2021, 6:12 PM IST

Updated : Aug 27, 2021, 6:51 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని ఖరారు చేసింది టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్. శుక్రవారం జరిగిన ​ పారాలింపిక్స్‌ మహిళల సింగిల్స్ క్లాస్​-4 క్వార్టర్స్​ఫైనల్స్​లో భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినాబెన్‌ పటేల్‌ చరిత్ర సృష్టించింది. 3-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ బొరిస్‌లవ పెరిక్‌ రంకోవిచ్‌ (సెర్బియా)ను మట్టికరిపించింది. ఫలితంగా సెమీస్​కు​ చేరిన తొలి భారత ప్యాడ్లర్​గా రికార్డుకెక్కింది.

కేవలం 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో వరుసగా 11-5,11-6,11-7తేడాతో మూడు గేముల్లో విజయం సాధించింది భవినా.

అంతకుముందు తొలిరౌండ్లో ఓడిన ఆమె రెండో రౌండ్​, ప్రిక్వార్టర్స్​కు చేరుకుంది. క్లాస్‌-4 విభాగంలో క్రీడాకారుల దేహం దిగువభాగం పనిచేయదు. వారు చక్రాల కుర్చీకే పరిమితమై ఆడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: అఫ్గానిస్థాన్​ పారాలింపిక్​ క్రీడాకారులు సేఫ్​

Last Updated : Aug 27, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.