ETV Bharat / sports

మహిళల హాకీ జట్టుకు డైమండ్​ కింగ్​ బంపర్​ ఆఫర్​!

author img

By

Published : Aug 4, 2021, 10:19 AM IST

భారత మహిళల హాకీ అథ్లెట్లకు శుభవార్త చెప్పారు సూరత్​కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి. ఒలింపిక్స్​లో పతకం గెలిచిన అథ్లెట్లకు రూ. 11 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు సావ్​జీ ధోలాకియా.

hockey, women's team
మహిళలా హాకీ జట్టు, ఒలింపిక్స్

భారత మహిళల హాకీ జట్టుకు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు గుజరాత్​ సూరత్​కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్​జీ ధోలాకియా. ఒలింపిక్స్​లో పతకం గెలిస్తే.. ఇళ్లు లేని అథ్లెట్లకు తమ సంస్థ తరఫున రూ. 11 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. సొంత ఇళ్లు ఉంటే రూ. 5 లక్షలు విలువ చేసే కారు ఇస్తామని ప్రకటించారు.

Savji Dholakia
సావ్​జీ ధోలాకియా

"భారత మహిళల హాకీ జట్టును సత్కరించాలని హెచ్​కే గ్రూప్​ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్​లో మెడల్​ గెలిస్తే.. సొంత ఇళ్లు కట్టుకోవాలని ఆశించిన అథ్లెట్లకు రూ. 11 లక్షలు బహుమతిగా ఇస్తాం. ఇతర అథ్లెట్లకు రూ. 5 లక్షలతో కారు ఇస్తాం. టోక్యో 2020లో మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు. మహిళల హాకీ జట్టు తొలిసారిగా ఒలింపిక్స్​లో సెమీస్​లోకి చేరింది. ఇది గర్వించదగ్గ విషయం."

--సావ్​జీ ధోలాకియా, వజ్రాల వ్యాపారి.

ఆటగాళ్లను మరింత ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధోలాకియా తెలిపారు. ధోలాకియా ప్రతి ఏడాది దీపావళికి తమ సంస్థ ఉద్యోగులకు కూడా బోనస్​గా కారు, ఇళ్లు, నగలు మొదలైన బహుమతులు ఇస్తుంటారు. ఆయనను డైమండ్​ కింగ్​ అని కూడా పిలుస్తారు.

HK group
ధోలాకియా ట్వీట్

ఇదీ చదవండి:Tokyo Olympics 2020: మహిళలు అదరగొడతారా?- గెలిస్తే చరిత్రే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.