ETV Bharat / sports

'మోదీ మాటలు మాలో స్ఫూర్తిని నింపాయి' - మన్​ప్రీత్​ సింగ్​ నరేంద్ర మోదీ

ఒలింపిక్స్​ కాంస్య పతకం మ్యాచ్​కు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని పురుషుల హాకీ జట్టు కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​ అన్నాడు. ఆయన మాటల స్ఫూర్తితో పాటు భిన్నమైన ఆలోచనా దృక్పథంతో బరిలో దిగి సత్తా చాటామని తెలిపాడు.

PM Modi's pep talk after semi-final loss boosted our confidence, says Manpreet Singh
'మోదీ మాటలు మాలో స్ఫూర్తిని నింపాయి'
author img

By

Published : Aug 11, 2021, 6:55 AM IST

ఒలింపిక్స్‌ హాకీ సెమీఫైనల్లో బెల్జియం చేతిలో ఓడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమతో మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ చెప్పాడు. ఆ స్ఫూర్తితో కాంస్య పతక పోరులో జర్మనీపై గెలిచామని అతనన్నాడు.

"బెల్జియం చేతిలో సెమీఫైనల్లో ఓడిన తర్వాత మేమంతా చాలా నిరాశలో కూరుకుపోయాం. ఈ సమయంలో ప్రధానమంత్రి మాతో మాట్లాడనున్నారని కోచ్‌ మాతో చెప్పాడు. 'మీరంతా చాలా బాగా ఆడారు. నిరుత్సాహపడొద్దు. కాంస్య పతక పోరులో సత్తా చాటి దేశాన్ని గర్వించేలా చేయండి' అని ఆయన మాతో అన్నారు. ఈ మాటలు జట్టుకు ఎంతో శక్తినిచ్చాయి. వట్టి చేతులతో భారత్‌కు వెళితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని అనుకున్నాం. 60 నిమిషాల్లో అందరం 100 శాతం ఆడితే మళ్లీ మా ముఖాల్లో నవ్వులు వస్తాయని భావించాం."

- మన్​ప్రీత్​ సింగ్​, భారత పురుషుల హకీ టీమ్ కెప్టెన్​

ఈసారి తాము భిన్నమైన ఆలోచనా ద్పక్పథంతో బరిలో దిగి సత్ఫలితాలు సాధించినట్లు మన్​ప్రీత్ తెలిపాడు. "పతకం గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. కెరీర్‌లో ఒలింపిక్స్‌ ఆడడం నాకిది మూడోసారి. కెప్టెన్‌గా తొలిసారి. 2012 క్రీడల్లో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గలేకపోయాం. కానీ ఆ తర్వాత ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించి మెరుగుపడ్డాం. 2016 క్రీడల్లో బాగానే ఆడినా క్వార్టర్‌ఫైనల్‌ దాటలేకపోయాం. కానీ ఈసారి భిన్నమైన ఆలోచనా దృక్పథంతో బరిలో దిగాం. ఈ క్రీడల కోసం ఎంతో శ్రమించాం. కరోనా సమయంలో చాలారోజులు బెంగళూరు సాయ్‌ కేంద్రంలో గడిపాం. పూర్తి స్థాయిలో రాణిస్తే పతకం గెలవొచ్చని ప్రతి ఒక్కరూ నమ్మాం. జట్టులో సీనియర్లు.. కుర్రాళ్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఎంతో కష్టపడ్డాం. చివరికి ఆ శ్రమే సత్ఫలితాన్ని ఇచ్చింది" అని మన్‌ప్రీత్‌ పేర్కొన్నాడు.

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం గెలిచిన భారత పురుషులు హాకీ జట్టు.. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వక్రీడల్లో పతకాన్ని సాధించింది.

ఇదీ చూడండి.. '15 నెలలుగా పడ్డ కష్టానికి ఫలితమే ఈ కాంస్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.