నిరుత్సాహపరిచిన నటరాజ్..
స్విమ్మింగ్ 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్‌లో శ్రీహరి నటరాజ్ నిరుత్సాహపరిచాడు. మొత్తం మీద 27వ స్థానంలో నిలిచిన నటరాజ్.. సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయాడు.
17:31 July 25

16:36 July 25
హాకీలో డీలా..
ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఘోరంగా విఫలమైంది. 1-7తో మన్‌ప్రీత్ సేన దారుణంగా ఓడిపోయింది.
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2తో గెలుపొందింది.
15:58 July 25
స్విమ్మింగ్‌లోనూ విఫలం..
స్విమ్మర్ మానా పటేల్ నిరాశకు గురిచేసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్ 1లో రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు ఆమె 1 నిమిషం 5 సెకెండ్ల సమయం తీసుకుంది. దీంతో 100మీటర్ల మహిళల బ్యాక్‌స్ట్రోక్ ప్రీ-క్వార్టర్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.
15:24 July 25
బాక్సింగ్‌లో నిరాశే..
బాక్సింగ్‌లో పురుషుల 63కేజీల విభాగం ప్రిలిమ్స్ రౌండ్ 32లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ప్రత్యర్థి లూక్ మెక్కార్నాక్ చేతిలో మనీశ్ కౌశిక్ ఓటమిపాలయ్యాడు.
13:47 July 25
మేరీకోమ్ గెలుపుతో ప్రారంభం
భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్‌ను విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్‌లో రిపబ్లిక్ ఆఫ్ డొమినిక్ క్రీడాకారిణి మిగ్యులినా హెర్నాండెజ్ గార్సియాపై 4-1 తేడాతో గెలిచింది. దీంతో తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది.
13:30 July 25
మనిక బత్రా మెరుపులు
టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ మనిక బత్రా.. మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో మార్గరిటా పెసోట్‌స్కాపై 4-3 తేడాతో విజయం సాధించింది.
12:07 July 25
జ్ఞానశేఖరన్ ఓటమి
టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారతకు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో జ్ఞానశేఖరన్ సత్యన్ ఓడిపోయాడు. హాంకాంగ్ ప్లేయర్ లామ్సియూ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలయ్యారు.
11:29 July 25
ఏకైక జిమ్నాస్ట్ ఇంటిముఖం
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పోటీలో నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు చేసి, 29వ స్థానంలో నిలిచింది.
10:45 July 25
భారత షూటర్లు ఫెయిల్
భారత పురుష షూటర్లు ఆదివారం నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయారు. దీపక్ కుమార్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో, పన్వర్ దివ్యాంశ్ సింగ్ 622.8 పాయింట్లతో 32వ స్థానంలో నిలచాడు. దీంతో ఈ విభాగంలో భారత్ కథ ముగిసింది.
09:19 July 25
సానియా జోడీ ఓటమి
టెన్నిస్ మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓటమిపాలైంది. ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో ఓడిపోయింది.
07:52 July 25
సింధు శుభారంభం..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో.. ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పొోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది.
07:00 July 25
రోయింగ్‌లో గుడ్ న్యూస్..
రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ జంట అదరగొట్టింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జులై 27న ఈ పోటీలు జరగనున్నాయి.
06:21 July 25
Olympics Live: మళ్లీ విఫలమైన మహిళా షూటర్లు
మను, యశస్వినికి నిరాశ..
స్టార్ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నిరాశపరిచారు. టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం ఏం లేకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది.
మను, యశస్విని వరుసగా 12,13 స్థానాల్లో నిలిచారు.