ETV Bharat / sports

నీరజ్​ గెలుపు రియోలోనే ఖరారైంది!

ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో పతకం అంటే భారత క్రీడాకారులకు పెద్ద కొండలాంటిదే. శతాబ్దం కిందట్నుంచి అథ్లెట్లు పోటీ పడుతునే ఉన్నారు. ఎవ్వరూ లక్ష్యాన్ని చేరుకున్నది లేదు. 1960లో మిల్కా.. 1984లో ఉష.. 2004లో అంజూ లక్ష్యానికి కొంచెం చేరువగా వెళ్లినా నిరాశ తప్పలేదు. కానీ ఆ కలను సాకారం చేశాడు నీరజ్​ చోప్డా. అయితే నీరజ్‌ ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగడంలో జర్మనీకి చెందిన అతడి కోచ్‌ యువ్‌ హోన్‌ది కీలక పాత్ర. ప్రపంచ జావెలిన్‌ క్రీడా చరిత్రలో 100 మీటర్లకు పైగా బల్లేన్ని విసిరిన ఏకైక క్రీడాకారుడితను.

neeraj chopra
నీరజ్​ చోప్డా
author img

By

Published : Aug 8, 2021, 9:05 AM IST

ఎదురుగా ఒక పెద్ద కొండ.. కింద ఓ కప్పల గుంపు.. అందులో ఒక్కొక్కటిగా ఆ కొండని ఎక్కే ప్రయత్నం చేస్తున్నాయ్‌! కానీ చాలా కప్పలు మధ్యలోనే ఆపేసి కింద పడిపోతున్నాయ్‌. కొన్ని ఇంకాస్త పైకెక్కి వెనుదిరుగుతున్నాయి. కానీ ఒక కప్ప మాత్రం కష్టపడి కొండను ఎక్కేసింది. ఎలా సాధ్యమైందా అని చూస్తే.. ఆ కప్పకు చెవులు పని చేయవట! అంత పెద్ద కొండను ఎక్కడం చాలా కష్టమంటూ చుట్టూ ఉన్న కప్పలు నిరుత్సాహ పరుస్తుంటే.. మిగతా కప్పలు జావగారిపోయి మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపేస్తున్నాయట. కానీ ఆ చెవిటి కప్పకు ఆ మాటలేవీ వినిపించకపోవడం వల్ల కొండను ఎక్కేసిందట!

ఇది పుస్తకాల్లో చదువుకునే నీతి కథ. ఇలాంటిదే ఇప్పుడొక నిజ జీవిత కథ చెప్పుకుందాం..

ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో పతకం అంటే భారత క్రీడాకారులకు పైకెక్కలేని ఒక పెద్ద కొండలాంటిదే. శతాబ్దం కిందట్నుంచి అథ్లెట్లు పోటీ పడుతునే ఉన్నారు. ఎవ్వరూ లక్ష్యాన్ని చేరుకున్నది లేదు. 1960లో మిల్కా.. 1984లో ఉష.. 2004లో అంజూ లక్ష్యానికి కొంచెం చేరువగా వెళ్లినా నిరాశ తప్పలేదు. కానీ ఇప్పుడొచ్చాడు ఒకడు. పైన చెప్పుకొన్న కప్పలా అతనేమీ చెవిటివాడు కాదు. ఒలింపిక్స్‌ అంటే ఆషామాషీ కాదని.. అథ్లెటిక్స్‌లో పతకం అంత తేలిక కాదని.. ప్రత్యర్థులు అలా ఇలా ఉండరని.. ఈ వ్యాఖ్యలన్నీ విన్నాడు. అయినా తన సామర్థ్యాన్ని నమ్మాడు. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణం చేజిక్కించుకుని అబ్బుర పరిచాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రియోలోనే ఖాయమైంది!

అవును.. నీరజ్‌ ఒలింపిక్‌ పతకం రియో ఒలింపిక్స్‌లోనే ఖరారైపోయింది! 2016 ఒలింపిక్స్‌కే వెళ్లని వాడికి పతకం ఖరారవ్వడమేంటి అనిపిస్తోందా? ఇదే చిత్రం. 2015-16 మధ్య రియో అర్హత టోర్నీలు జరుగుతున్నప్పటికి నీరజ్‌ వయసు 17 ఏళ్లే. అప్పుడే ప్రపంచ స్థాయిని అందుకుంటున్న అతను రియో బెర్తు సాధించలేకపోయాడు. కానీ రియోలో ఒలింపిక్స్‌ జరుగుతున్న సమయంలోనే అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌.. 86.48 మీటర్ల దూరం బల్లెం విసిరి స్వర్ణం సాధించాడు. అది రియోలో కాంస్య ప్రదర్శన (85.38 మీ.) కంటే మెరుగు కావడం విశేషం. కాబట్టి నీరజ్‌ రియోకు వెళ్లి ఉంటే అప్పుడే పతకం వచ్చేది. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్‌ 88.06 మీ.తో నీరజ్‌.. రియో రజత విజేత ప్రదర్శనకూ (88.64 మీ.) చేరువగా వచ్చాడు. ఈ రెండు ప్రదర్శనలతోనే అర్థమైపోయింది.. నీరజ్‌ ఒలింపిక్‌ పతక రేసులో ఉన్నాడని.

రెండేళ్ల ముందు చేతినే లేపలేక..

neeraj chopras
చికిత్స అనంతరం నీరజ్

2018 ఆసియా క్రీడల్లో 88.06 మీటర్ల ప్రదర్శనతో నీరజ్‌ మంచి ఊపుమీదున్న వేళ.. అతణ్ని కుడి మోచేతి నొప్పి వేధించింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తు సాధించి అందుకోసం సన్నద్ధమవుతుండగా నొప్పి మరింత ఎక్కువైంది. మోచేతికి తీవ్ర గాయమే అయిందని, శస్త్రచికిత్స తప్పదని చెప్పారు వైద్యులు. దీంతో నీరజ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. ఏడాదిలో ఒలింపిక్స్‌ ఉండగా.. బల్లెం విసిరే కుడి చేతికి శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో పడుకోవాల్సిన పరిస్థితి. చికిత్స తర్వాత కొన్ని నెలలు సాధనకు దూరంగా ఉన్నాడు. ఆపై మళ్లీ సాధన ఆరంభించి టోక్యో వైపు అడుగేశాడు.

కోచ్​.. మామూలోడు కాదు!

Neeraj Chopra
నీరజ్​ కోచ్​

నీరజ్‌ ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగడంలో జర్మనీకి చెందిన అతడి కోచ్‌ యువ్‌ హోన్‌ది కీలక పాత్ర. ప్రపంచ జావెలిన్‌ క్రీడా చరిత్రలో 100 మీటర్లకు పైగా బల్లేన్ని విసిరిన ఏకైక క్రీడాకారుడతను. 1984లో అతను 104.8 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆటగాడిగా కెరీర్‌ ముగిశాక 1999లో కోచ్‌గా మారాడు హోన్‌. టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా 2017లో అతణ్ని నీరజ్‌కు వ్యక్తిగత కోచ్‌గా నియమించింది భారత అథ్లెటిక్‌ సమాఖ్య. హోన్‌ వచ్చాక నీరజ్‌ ప్రదర్శన మెరుగవుతూ వచ్చింది. ఏడాది తిరక్కుండానే 88 మీటర్ల మార్కును అందుకుని ఔరా అనిపించాడు. హోన్‌తో కలిసి ఎక్కువగా ఐరోపాలోనే ఉంటూ శిక్షణ పొందుతూ, ఆటలో కొత్త టెక్నిక్‌లు నేర్చుకుంటూ ఇప్పుడు ఒలింపిక్‌ స్వర్ణం సాధించాడు.

ఇదీ చూడండి:- వందేళ్ల భారత నిరీక్షణకు తెర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.