ETV Bharat / sports

నీరజ్​ చోప్డాకు తీవ్ర జ్వరం.. ఆస్పత్రికి తరలింపు - నీరజ్​ చోప్డా స్వగ్రామం

భారీ ఊరేగింపుతో దిల్లీ నుంచి స్వగ్రామానికి బయల్దేరిన టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్డా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

neeraj
చోప్డా
author img

By

Published : Aug 17, 2021, 7:20 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్​ త్రో క్రీడాకారుడు నీరజ్​ చోప్డా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి బాగా జ్వరం వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు స్నేహితులు, కుటుంబసభ్యులు తెలిపారు.

ఒలింపిక్స్​ తర్వాత తొలిసారి మంగళవారం దిల్లీ నుంచి హరియాణా పానిపట్​ సమీపంలోని తన స్వగ్రామమైన సమల్ఖాకు భారీ ఉరేగింపుతో బయల్దేరాడు నీరజ్​. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అతడిపై పూల వర్షం కురిపించారు. దారిపొడవునా కారు టాప్​పై ఉండి అందరికీ అభివాదం చేస్తూనే ఉన్నాడు నీరజ్. దీంతో దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ యాత్రలో నీరసించిపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఊరేగింపు చివరి వరకు కూడా ఉండలేకు మార్గ మధ్యలోనే తప్పుకొన్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఒలింపిక్స్​ తర్వాత వరుస సన్మాన కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు నీరజ్​. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడికి జ్వరం సోకింది. టెస్టులు చేయించుకోగా కొవిడ్​ నెగిటివ్​ వచ్చింది. అనారోగ్యం వల్ల ఇటీవల హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి అతడు గైర్హాజరయ్యాడు. అయితే ఆ తర్వాత దిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం మంగళవారం అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో స్వగ్రామానికి బయల్దేరగా మార్గమధ్యలో అతడికి జ్వరం సోకింది.

ఇదీ చూడండి: వినేశ్​కు మద్దతుగా నిలిచిన నీరజ్​ చోప్డా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.