టోక్యో పారాలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రో పోటీల్లో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్(Sumith Javelin Throw)ను ప్రశంసించాడు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్డా(Neeraj Chopra). 'అత్యుత్తమ ప్రదర్శన చేశావు సోదరా సుమిత్' అని ట్వీట్ చేశాడు. సుమిత్‌ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపాడు.
-
ख़तरनाक performance भाई सुमित 👌💪 proud of you 🇮🇳 https://t.co/CNUDDtPAc7
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ख़तरनाक performance भाई सुमित 👌💪 proud of you 🇮🇳 https://t.co/CNUDDtPAc7
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 30, 2021ख़तरनाक performance भाई सुमित 👌💪 proud of you 🇮🇳 https://t.co/CNUDDtPAc7
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 30, 2021
భారత పారా అథ్లెట్ సుమిత్(Sumith Javelin Throw).. టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో చరిత్ర సృష్టించాడు. ఎఫ్ 64 విభాగంలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్లోనే 66.95 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు సుమిత్. ఆ తర్వాత రెండో రౌండ్లో 68.08, ఐదో రౌండ్లో 68.55 మీట్లర్ల దూరం విసిరి మరోసారి తన రికార్డును తానే బద్దలుకొట్టి వరల్డ్ రికార్డుకెక్కాడు.
గతంలో 2019లో దుబాయ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్స్లోనూ హరియాణా సోనేపట్‌కు చెందిన సుమిత్ రజత పతకం సాధించాడు. ఎఫ్ 64 విభాగంలో ఈ పతకం సొంతం చేసుకున్నాడు.
ఇదీ చదవండి:టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం