ETV Bharat / sports

హాకీ ఆడిన నీరజ్.. బల్లెం విసిరిన మన్​ప్రీత్​ సింగ్​ - మన్​ప్రీత్​ సింగ్​

తాము చదువుకున్న యూనివర్సిటీ నిర్వహించిన సన్మాన సభలో పాల్గొని సందడి చేశారు టోక్యో ఒలింపిక్స్​(Tokyo olympics Neeraj chopra) స్వర్ణ విజేత నీరజ్​ చోప్డా, హాకీ జట్టు సభ్యులు. ఇందులో భాగంగా నీరజ్​ హాకీ ఆడగా.. కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​ బల్లెం విసిరి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు.

tokyo olympics
నీరజ్​
author img

By

Published : Aug 31, 2021, 9:56 PM IST

Updated : Aug 31, 2021, 10:30 PM IST

క్రీడాకారులు తమ ప్రొఫెషనల్​ ఆటను కాకుండా మరో క్రీడను ఆడుతుంటే కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఇదే విధంగా టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్​ త్రోలో స్వర్ణం ముద్దాడిన నీరజ్​ చోప్డా(Tokyo olympics Neeraj chopra) హాకీ ఆడితే.. హాకీ కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​ ఈటె విసిరితే ఎలా ఉంటుంది? ఊహించడానికి చాలా బాగుంది కదూ.. ఇదే దృశ్యం పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సన్మాన సభకు విచ్చేసిన ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

హాకీ ఆడిన నీరజ్.. బల్లెం విసిరిన మన్​ప్రీత్​

ఇలా జరిగింది

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన తమ పూర్వ విద్యార్థులు 13 మందికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీ. వారికి నగదు బహమతి ప్రకటించింది. వీరిలో గోల్డ్​ మెడల్​ సాధించిన నీరజ్​ చోప్డా, కాంస్య పతకం అందుకున్న హాకీ పురుషుల జట్టు సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో భాగంగానే నీరజ్​.. హాకీ జట్టుతో కలిసి ఆడగా.. హాకీ కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​ బల్లెం విసిరి వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు.

tokyo olympics
హాకీ స్టిక్​ ప్టటిన నీరజ్​

నగదు బహుమతి ఎంతంటే?

నీరజ్​కు(స్వర్ణం) రూ.50లక్షలు, హాకీ జట్టుకు(కాంస్యం) రూ. 85లక్షలు, రెజ్లర్​ భజరంగ్​ పూనియాకు(కాంస్యం) రూ.10లక్షలు, పారాలింపిక్​ హైజంపర్​ నిషాద్​ కూమార్(రజతం)​ రూ.25 లక్షలు నగదు బహుమతిని ప్రకటించింది లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీ.

tokyo olympics
నీరజ్​ చోప్రా

"ఒలింపిక్స్​లో పతకం సాధించాక ఇక్కడికి తిరిగి రావడం ఎంతో గర్వంగా ఉంది. నా కలను చేరుకోవడంలో ఎల్​పీయూ, ఫ్యాకల్టీ ఎంతో ప్రోత్సహించారు. భవిష్యత్​లో ఈ యూనివర్సిటీ మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని నమ్ముతున్నా" అని నీరజ్​ ఈ సందర్భంగా వెల్లడించాడు.

tokyo olympics
నీరజ్​ చోప్రా మన్​ప్రీత్​ సింగ్​

ఇదీ చూడండి: పసిడితో నీరజ్​ మెరిసే.. భారత శిబిరం మురిసే!

Last Updated : Aug 31, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.