ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్‌ వల్ల మెక్‌ డొనాల్డ్స్‌కు భారీ నష్టం!

ఒలింపిక్స్​కు గతంలో స్పాన్సర్​షిప్​గా ఉన్న ఫాస్ట్​ఫుడ్​ కంపెనీ మెక్​ డొనాల్డ్స్.. మిలియన్‌ డాలర్ల నష్టాలను చవిచూసింది. సంస్థ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇంతకీ ఎప్పుడు, ఏం జరిగిందంటే?

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 31, 2021, 7:26 AM IST

నాలుగేళ్లకొకసారి జరిగే ఒలింపిక్స్‌లో కేవలం క్రీడలే కాదు.. వ్యాపారపరంగానూ ఎన్నో ప్రణాళికలు, వ్యవహారాలు ఉంటాయి. కొన్ని కంపెనీలు ఈ క్రీడలను స్పాన్సర్‌ చేయడం, క్రీడల్లో తమ బ్రాండ్‌ను ప్రచారం చేయడం వంటివి జరుగుతుంటాయి. ప్రపంచమంతా చూసే ఈ క్రీడల్లో ప్రచారం చేస్తే తమ బ్రాండ్‌ను ప్రజలు ఆదరిస్తారని వ్యాపారుల ఆలోచన. అదేవిధంగా ఫాస్ట్‌ఫుడ్‌ కంపెనీ మెక్‌ డొనాల్డ్స్‌ కూడా ముందుచూపుతో అన్నివిధాల లాభపడతామని భావించి.. 1984లో జరిగిన ఒలింపిక్స్‌కు స్పాన్సర్‌షిప్‌ ఇచ్చింది. అయితే, ప్రచారం జరగడమేమోగానీ సంస్థ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. దీంతో భారీ నష్టాలను చవిచూసింది. ఎందుకంటారా?

ఒలింపిక్స్‌ను 1984లో అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించారు. మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థ ఈ ఒలింపిక్స్‌కు స్పాన్సర్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రజలకు ‘వెన్‌ ది యూఎస్‌ విన్‌.. యూ విన్‌(యూఎస్‌ గెలిచినప్పుడు.. మీరు గెలుస్తారు) పేరుతో ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజలకు మెక్‌ డొనాల్డ్స్‌ స్క్రాచ్‌కార్డులను పంపిణీ చేసింది. ఆ స్క్రాచ్‌కార్డ్‌ గీకితే దాంట్లో ఏదో ఒక క్రీడావిభాగం ఉంటుంది. ఆ క్రీడలో యూఎస్‌ అథ్లెట్ పతకం గెలిస్తే.. బర్గర్లు, కోక్‌, ఫ్రైస్‌ ఉచితంగా ఇస్తామని మెక్‌ డొనాల్డ్స్‌ వెల్లడించింది.

ఫ్రీ ఆఫర్‌ కోసం చాలానే ఆలోచించింది.. కానీ!

ఏ కంపెనీ కూడా ప్రజలకు ఫ్రీ ఆఫర్‌ ఇచ్చి నష్టపోదు. అనుకున్న మొత్తాన్ని ఖర్చు చేసి అధిక లాభం పొందాలని చూస్తుంది. ఇందుకోసం అనేక రకాల ప్రణాళికలు రచిస్తుంది. మెక్‌ డొనాల్డ్స్‌ కూడా ఈ ఫ్రీ ఆఫర్‌ కోసం భారీగానే కసరత్తులు చేసింది. గత ఒలింపిక్స్‌లో అమెరికా ఎన్ని పతకాలు సాధించింది.. ఇప్పుడు ఎన్ని సాధించగలదు.. ఎన్ని సాధిస్తే ఉచితంగా బర్గర్లు అందించొచ్చనే విషయాలను అంచనా వేసింది. 1976లో అమెరికా కేవలం 94(34 స్వర్ణం) పతకాలు మాత్రమే గెలిచింది. నిజానికి ఏటా ఒలింపిక్స్‌లో రష్యా(అప్పటి సోవియట్‌ యూనియన్‌), ఈస్ట్‌ జర్మనీ తదితర దేశాలు అమెరికా కన్నా ఎక్కువ పతకాలు సాధించేవి. ఈ సారి కూడా అమెరికా గెలిచే పతకాల సంఖ్య తక్కువగానే ఉంటుందని భావించి ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించేసింది.

కానీ, అక్కడే మెక్‌ డొనాల్డ్స్‌ పొరపాటు చేసింది. ఆ సమయంలో అమెరికా-రష్యా మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ క్రమంలో 1980లో రష్యాలో జరిగిన ఒలింపిక్స్‌కు అమెరికా దూరంగా ఉంది. ఆ చర్యకు ప్రతిచర్యగా.. రష్యా, తన మిత్ర దేశం ఈస్ట్‌ జర్మనీ 1984 యూఎస్‌ ఒలింపిక్స్‌ను నిషేధించాయి. ఈ విషయాన్ని మెక్‌ డొనాల్డ్స్‌ గుర్తించలేకపోయింది. దీంతో ఒలింపిక్స్‌లో ఎప్పుడూ అత్యధిక పతకాలు ఎత్తుకెళ్లే రష్యా, దాని మిత్రదేశాలు పోటీలో లేకపోవడంతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న అమెరికా కనివినీ ఎరుగని విధంగా పతకాలు దక్కించుకుంది. మొత్తం 174 (83 స్వర్ణం, 61 రజతం, 30 కాంస్యం) పతకాలు సొంతం చేసుకుంది. దీంతో ఉచిత ఫాస్ట్‌ఫుడ్‌ కోసం ప్రజలు మెక్‌ డొనాల్డ్స్‌ ముందు క్యూ కట్టారు. సంస్థ వేసుకున్న అంచనా కంటే రెండింతల ఫాస్ట్‌ఫుడ్‌ ఉచితంగా పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇచ్చిన మాటను తప్పని పరిస్థితుల్లో నిలబెట్టుకొని తీవ్రంగా నష్టపోయింది. నష్టం విలువ ఎంతని మెక్‌ డొనాల్డ్స్‌ ఎప్పుడూ ప్రకంటించలేదు. కానీ, అప్పట్లోనే కొన్ని మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే, క్రీడలకు స్పాన్సర్‌షిప్‌.. ప్రకటనలు, ప్రచారం అంశాలపై చర్చలు జరిగితే.. మెక్‌ డొనాల్డ్స్‌-ఒలింపిక్స్‌ 1984 ప్రస్తావన కూడా వస్తుంటుంది.

ఇదీ చూడండి: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.