ఒలింపిక్స్ హాకీలో భారత్ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
నాలుగో క్వార్టర్‌లో రెండు గోల్స్‌తో ఆదరగొట్టింది భారత జట్టు. చివరి రెండు నిమిషాల్లో 2 గోల్స్ చేయడం విశేషం.
తొలి అర్ధభాగం 0-0..
తొలి రెండు క్వార్టర్స్ గోల్స్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్‌లో 43వ నిమిషంలో కుమార్ వరుణ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. వివేక్ సాగర్ ప్రసాద్(58వ), హర్మన్ ప్రీత్ సింగ్(59వ) నిమిషాల్లో గోల్స్ చేసి భారత్ ఆధిపత్యాన్ని 3-1కి పెంచారు. అర్జెంటీనాకు ఏకైక గోల్ 48వ నిమిషంలో.. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చింది.
పూల్ ఏలో.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచింది మెన్ ఇన్ బ్లూ. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆరు జట్లలో నాలుగు క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన భారత్ .. నాకౌట్ చేరినట్లే. మెన్ ఇన్ బ్లూ.. తన చివరి ఐదో మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.
అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే అవకాశాలుంటాయి.
ఇదీ చూడండి: సింధు దూకుడు.. ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం