ETV Bharat / sports

నాడు మల్లీశ్వరి.. నేడు మీరా.. ఒలింపిక్స్​లో నారీశక్తి

వరుసగా మూడో ఒలింపిక్స్​లో భారత మహిళ అథ్లెట్లు పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2012, 2016 విశ్వక్రీడల్లో ఇద్దరేసి మహిళా క్రీడాకారులు మెడల్స్​ సాధించగా.. తాజాగా మీరాభాయ్​ అదే ఒరవడిని కొనసాగిస్తూ సిల్వర్​ మెడల్​ను గెలుపొందింది.

tokyo olympics 2020
టోక్యో ఒలింపిక్స్ 2020
author img

By

Published : Jul 24, 2021, 7:23 PM IST

ఒలింపిక్స్​ల్లో మహిళా క్రీడాకారులు తమ హవా కొనసాగిస్తున్నారు. విశ్వక్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా టోక్యో గేమ్స్​లో వెయిట్​లిఫ్టర్​ మీరాభాయ్​ చాను సిల్వర్​ మెడల్​తో మెరిసింది. దీంతో 2012 లండన్​ గేమ్స్​ నుంచి వరుసగా మూడో మెగా ఈవెంట్​లో మెడల్​ను సాధించినట్లైంది.

21వ శతాబ్దంలో మొత్తంగా 14 పతకాలు భారత ఖాతాలో చేరగా.. అందులో మహిళ అథ్లెట్లు 6 సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్​లో వెయిట్​లిఫ్టింగ్​ విభాగంలో కరణం మల్లీశ్వరీ కాంస్య పతకం గెలుపొందింది. ఇక 2004, 2008 విశ్వక్రీడల్లో మహిళలు పతకం లేకుండానే వెనుదిరిగారు. 2012లో తొలిసారిగా ఒకే మెగా ఈవెంట్​లో రెండు పతకాలు సాధించారు భారత మహిళలు. బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్​ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

ఇక 2016 రియో ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు సిల్వర్​ మెడల్ సాధించింది. అదే ఏడాది రెజ్లింగ్​లో సాక్షి మాలిక్​ కాంస్య పతకం గెలుచుకుంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ తాజా మీరాభాయ్​ ఒలింపిక్స్​లో వెండి పతకాన్ని గెలుచుకుంది.

ఇదీ చదవండి: Mirabai Chanu: రియో పాఠాలతో.. టోక్యోలో పతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.