ETV Bharat / sports

ఒలింపిక్స్​లో పతకం.. ప్రభుత్వ పాఠశాల పేరు మార్పు

టోక్యో ఒలింపిక్స్​లో రజత పతక విజేత రెజ్లర్​ రవి దహియాకు అరుదైన గౌరవం లభించింది. దిల్లీలో తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు అతని పేరు పెట్టారు.

ravi dahiya
రహి దాహియా
author img

By

Published : Aug 17, 2021, 8:09 PM IST

Updated : Aug 19, 2021, 8:38 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో రజత పతక విజేత రెజ్లర్​ రవి దహియాకు అరుదైన గౌరవం దక్కింది. దిల్లీలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు తన పేరును పెట్టారు. ఆదర్శ్​నగర్​లో ఉన్న ఈ పాఠశాలకు రహిదహియా బాల విద్యాలయగా పేరు మార్చారు. ఈ విషయాన్ని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసొడియా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.

మంగళవారం ఈ పాఠశాలలో రవి దహియాకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులంతా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు.

రవి దహియా.. తన తొలి ఒలింపిక్స్​లోనే(టోక్యో) అద్భుత ప్రదర్శన చేసి రజత పతకం గెలుచుకున్నాడు. ఒలింపిక్స్​లో సిల్వర్​ మెడల్​ సాధించిన రెండో భారత రెజ్లర్​గా గుర్తింపు పొందాడు.

ఇదీ చూడండి: Ravi Kumar Dahiya: కష్టాల కడలిని దాటి పసిడిపై కన్నేసి!

Last Updated : Aug 19, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.