వయసు కేవలం నంబరు మాత్రమే అని నిరూపించారు ఓ పెద్దాయన. తన వయసు వారికి సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మునిమనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. టెన్నిస్ కోర్టులో యువ ఆటగాళ్లకు దీటుగా రాకెట్ పట్టుకుని ఆడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే ఉక్రెయిన్‌కు చెందిన 97ఏళ్ల లియోనిడ్ స్టానిస్లకీ(Leonid Stanislavskyi). ప్రపంచంలో టెన్నిస్ ఆడుతున్న అతిపెద్ద వయస్కుడిగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు. ప్రపంచ, యూరోపియన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన వయసు అడ్డే రాలేదు.
లియోనిడ్.. 1924 మార్చి 22న జన్మించారు. జిమ్నాస్టిక్స్‌లో సోవియట్ ఛాంపియన్ అయిన ఆయన 30ఏళ్ల వయసులో రాకెట్‌ను పట్టుకున్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆడుతున్నట్లు చెప్పిన ఆయన తన ఫిట్‌నెస్‌కు గల కారణాన్ని వివరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"టెన్నిస్ శరీరానికి మంచి వ్యాయామం లాంటిది. అద్భుతమైన ఆట. ఈ ఆట ఆడేందుకు వయసుతో సంబంధం లేదు. ప్రతిరోజు సానుకూల దృక్పథంలో రోజు మొదలుపెడతాను. క్రమం తప్పకుండా టెన్నిస్ ఆడుతా. జిమ్నాస్టిక్స్ చేస్తాను. పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కసరత్తులు చేస్తాను. స్విమ్మింగ్, స్కైయింగ్ చేయడమంటే ఇష్టం. ప్యారాషూట్ జంప్ చేయాలనేది నా కల. 100ఏళ్లు జీవించి, ఒక్కసారైనా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌తో ఆడలనేదే నా లక్ష్యం."
-లియోనిడ్ స్టానిస్లకీ
అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ తొలిసారి ఈ ఏడాది.. 90 ఏళ్లు పైబడినవారి కోసం టోర్న్‌మెంట్ నిర్వహించనుంది. ఈ టోర్నీలోనే ఆయన ఆడనున్నారు. తమ వయసు వారికి పోటీలు నిర్వహించాలని ఫెడరేషన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు లియోనిడ్. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ఫెడరేషన్ 'సూపర్ సీనియర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021' పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్‌లో స్పెయిన్ వేదికగా ఈ ఛాంపియన్షిప్ జరగనుంది.
ఇదీ చూడండి: స్విస్ నాణేలపై ఫెదరర్.. ఆ దేశ చరిత్రలో తొలిసారి