ETV Bharat / sports

Wimbledon: క్వార్టర్స్​లో ఫెదరర్.. అరుదైన రికార్డు - వింబుల్డన్​లో ఫెదరర్ రికార్డు

స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ రోజర్​ ఫెదరర్​.. వింబుల్డన్ క్వార్టర్స్​లోకి దూసుకెళ్లాడు. ఓపెన్ యుగంలో క్వార్టర్స్​కు అర్హత సాధించిన పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు.

roger feder, oldest man to reach quarters in Open Era
రోజర్ ఫెదరర్, వింబుల్డన్​లో అరుదైన రికార్డు
author img

By

Published : Jul 6, 2021, 7:59 AM IST

స్విస్​ టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్..​ వింబుల్డన్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెన్​ యుగంలో క్వార్టర్స్​కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా సరికొత్త రికార్డు సాధించాడు. ఇటలీ ప్లేయర్​ లోరెన్​ సొనెగోతో జరిగిన ప్రిక్వార్టర్స్​లో 7-5, 6-4, 6-2 తేడాతో గెలిచి ఈ ఘనత సాధించాడు.

ఈ గెలుపుతో వింబుల్డన్​ ఓపెన్​లో 18వ సారి​ క్వార్టర్స్​కు చేరాడు రోజర్. మొత్తంగా 2 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ఫెదరర్​​కు ప్రత్యర్థి నుంచి మొదట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్​లో 5-5తో ఇరువురు సమానంగా ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. దీంతో కొద్దిసేపు ఆటకు విరామం ప్రకటించారు. అనంతరం కోర్టులోకి దిగిన స్విస్​ ఆటగాడు.. వెనక్కి తిరిగి చూడలేదు. పాత ఫెదరర్​ను గుర్తుకు తెచ్చాడు. తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటి చెప్పాడు. చివరి రెండు సెట్లు పూర్తి నియంత్రణతో ఆడాడు.

రెండో సీడ్​ డానియల్ మెద్వెదెవ్​, 14వ సీడ్​ హుబెర్ట్​ హుర్కాజ్​ మధ్య జరుగుతోన్న మ్యాచ్​ వర్షం కారణంగా ఆగిపోయింది. 6-2, 6-7(2), 3-6, 3-4తో ఉన్న ఈ గేమ్​లో మంగళవారం ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్​లో విజేతగా నిలిచిన వ్యక్తితో ఫెదరర్.. క్వార్టర్స్​లో తలపడనున్నాడు.

ఇదీ చదవండి: Wimbledon: గ్రాండ్​స్లామ్​ క్వార్టర్స్​లో జకోవిచ్​ 50వసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.