వింబుల్డన్(Wimbledon) ఓపెన్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ప్రిక్వార్టర్స్‌లో చేరాడు. మూడో రౌండ్లో కొద్దిగా ప్రతిఘటన ఎదుర్కొన్న జకో 6-4, 6-3, 7-6 (9/7)తో కుడ్లా (అమెరికా)ను ఓడించాడు. రష్యా స్టార్ రుబ్‌లెవ్ 6-3, 5-7, 6-4, 6-3తో ఫాగ్‌నిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ అగట్ 7-5, 6-1, 7-6 (7/4)తో కీఫర్ (జర్మనీ)పై గెలవగా.. గారిన్ 6-4, 6-3, 4-6, 6-4తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. మార్టాన్ (హంగేరి) 6-3, 6-3, 6-7 (6-8), 6-4తో తొమ్మిదో సీడ్ ష్వార్జ్‌మ్యాన్‌ను ఓడించాడు.
స్వైటెక్ అలవోకగా..
పోలెండ్ అమ్మాయి ఇగా స్వైటెక్(Iga Swiatek) కూడా ఈ టోర్నీలో దూసుకెళ్తోంది. ఆమె అలవోకగా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో ఏడో సీడ్ స్వైటెక్ 6-1, 6-0తో ఇరినా బెగు (బెల్జియం)ను చిత్తు చేసింది. పదకొండో సీడ్ ముగురుజ (స్పెయిన్) కథ రెండో రౌండ్లోనే ముగిసింది. ట్యూనీసియా అమ్మాయి జబెర్ 5-7, 6-3, 6-2తో ముగురుజను ఓడించింది. చెక్ రిపబ్లిక్ తార ప్లిస్కోవా కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. ఈ ఎనిమిదో సీడ్ 6-3, 6-3తో మార్టికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. సబలెంక (బెలారస్), శాంసోనోవా (రష్యా), రెబకీనా (ఉక్రెయిన్), గోల్‌బిక్ (స్విట్జర్లాండ్) ముందంజ వేశారు. సంసోనవా 6-2, 2-6, 6-4తో అమెరికా కెరటం స్లోన్ స్టీఫెన్స్‌ను ఓడించగా, రెబకీనా 6-1, 6-4తో రోజర్స్ (అమెరికా)పై, సబలెంక 6-0, 6-3తో ఒసోరియో (కొలంబియా)పై, గోల్‌బిక్ 6-2, 6-1తో బ్రింగెల్ (అమెరికా)పై నెగ్గారు.
ఇదీ చదవండి: Wimbledon news: మన ప్లేయర్లతో మన ప్లేయర్లు మ్యాచ్