ETV Bharat / sports

Wimbledon: 20 కోసం జకో.. తొలి గ్రాండ్​స్లామ్​​ దిశగా బెరిటిని - జకోవిచ్ vs బెరిటిని

వింబుల్డన్​(Wimbledon) పురుషుల సింగిల్స్​ తుది అంకానికి చేరింది. ఫైనల్లో సెర్బియా స్టార్​ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)​తో ఇటలీ ఆటగాడు బెరిటిని(Matteo Berrettini) తలపడనున్నాడు. అయితే ప్రస్తుత టోర్నీ గెలిచి దిగ్గజ ఆటగాళ్లు ఫెదరర్, నాదల్ (అత్యధికంగా 20 టైటిళ్లు)​ సరసన చేరాలని జకో పట్టుదలతో ఉండగా.. మరోవైపు బెరిటిని తొలి గ్రాండ్​స్లామ్​ను తన ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నాడు.

djokovic, berrettini
నొవాక్ జకోవిచ్, బెరిటిని
author img

By

Published : Jul 11, 2021, 6:51 AM IST

Updated : Jul 11, 2021, 8:42 AM IST

అత్యధిక సింగిల్స్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్(20)ను సమం చేయడానికి సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్​ (Novak Djokovic)కు సువర్ణావకాశం! అతడు ఒక్క అడుగేస్తే వాళ్ల సరసన నిలుస్తాడు. అందుకు ఆదివారం మాటో బెరిటిని (ఇటలీ)తో జరిగే వింబుల్డన్​(Wimbledon) ఫైనల్లో గెలవాల్సి ఉంది. అంతేకాదు తుది పోరులో నెగ్గితే అతడికిది వరుసగా మూడో వింబుల్డన్ టైటిల్, మొత్తం మీద ఆరో ట్రోఫీ కానుంది.

ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భీకర ఫామ్ లో ఉన్న నొవాక్.. ఇదే జోరు తుది సమరంలో ప్రదర్శిస్తే అతడికి తిరుగే ఉండదు. ఈ ఏడాది 36 మ్యాచ్​లు ఆడిన అతడు 32 విజయాలు సాధించాడంటేనే జకో జోరును అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న జకోను ఆపడం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరిటినికి కష్టమే. తానాడిన గత 16 గ్రాండ్​స్లామ్ ఫైనల్స్​లో ఈ సెర్బియా స్టార్ కేవలం మూడింట్లో మాత్రమే ఓడిపోయాడు.

అయితే తొలిసారి ఓ గ్రాండ్స్​స్లామ్​ టోర్నీ తుది సమరానికి చేరిన బెరిటిని(Matteo Berrettini) మంచి ఫామ్​లో ఉన్నాడు. గ్రాస్​ కోర్టుపై ఆడిన గత 11 మ్యాచ్​లో అతడు పరాజయం ఎరుగడు. వింబుల్డన్ టైటిల్ పోరులో బెరిటిని గెలిస్తే.. అడ్రియానో పనెటా (ఫ్రెంచ్ ఓపెన్, 1976) తర్వాత ఓ గ్రాండ్​స్లామ్​ టైటిల్ గెలిచిన ఇటలీ ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. గతంలో నొవాక్​తో తలపడిన రెండుసార్లూ బెరిటినికి ఓటమే ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్​లో క్వార్టర్ ఫైనల్లో వీళ్లిద్దరూ ఎదురుపడగా జకోదే పైచేయి అయింది.

ఇదీ చదవండి: Wimbledon: వింబుల్డన్​ విజేతగా​ బార్టీ

Last Updated : Jul 11, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.