ఇప్పటికే ఒలింపిక్స్ నుంచి తప్పుకొన్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ఇప్పుడు వింబుల్డన్ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆమె.. టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆడిన సెరెనా.. ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది.
-
We're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78s
">We're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78sWe're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78s
మోడ్రన్ టెన్నిస్‌లో ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. ఇప్పటి వరకు 23 సొంతం చేసుకుంది. అయితే ఆల్‌టైం గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్ కోర్ట్(24) పేరుతో ఉంది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని రెండేళ్ల నుంచి సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు.
తనకు అచ్చొచ్చిన వింబుల్డన్‌పై సెరెనా విలియమ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అనూహ్యంగా గాయం కారణంగా నిష్ర్కమించక తప్పలేదు. మంగళవారం ఆమె సెంటర్ కోర్టులో అలియక్‌సాండ్ర ససనోవిచ్‌తో తలపడింది. ఐదో గేమ్‌లో సర్వీస్ చేస్తుండగా బేస్‌లైన్ వద్ద ఆమె కాలు బెణికింది. పాయింట్ల మధ్య నొప్పితో విలవిల్లాడింది. ఆ గేమ్ పూర్తవగానే మెడికల్ టైమ్ ఔట్ తీసుకుని ఆట కొనసాగించింది.
నొప్పికి తట్టుకోలేక విలియమ్స్ పెదవులను బిగపట్టి కన్నీరు పెట్టుకుంది. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని విలవిల్లాడింది. ఆ సమయంలో అభిమానులు ఆమెకెంతో అండగా నిలిచారు. అరుపులతో ప్రోత్సహించారు. చివరికి నొప్పి భరించలేని ఆమె మోకాళ్లపై మైదానంలో కూలబడింది. ఛైర్ అంపైర్ ఆమె దగ్గరికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత నెట్ వద్దకు వెళ్లిన విలియమ్స్ ప్రత్యర్థితో చేయి కలిపి అభిమానులకు వందనం చేస్తూ ఏడుస్తూ మ్యాచ్ నుంచి తప్పుకుంది.
సెరెనా విలియమ్స్ కెరీర్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్లోనే తప్పుకోవడం ఇది కేవలం రెండోసారే. ఆమె ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పోటీ చేసిన చివరి రెండుసార్లు అంటే 2018, 2019లో ఆమె వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచింది. కరోనా వైరస్ కారణంగా గతేడాది టోర్నీ నిర్వహించలేదు.
ఇది చదవండి: ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్