సుమిత్ నగల్ (190వ ర్యాంకు).. భారత యువ టెన్నిస్ ఆటగాడు. యూఎస్ ఓపెన్‌లో పాల్గొననున్న అతి పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. క్వాలిఫయిర్ మ్యాచ్ చివరి పోరులో బ్రెజిల్ ఆటగాడు మెనిజెస్ను 5-7, 6-4, 6-3 తేడాతో ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సుమిత్ వయసు 22 ఏళ్లు.
2015లో వింబుల్డన్ జూనియర్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సుమిత్.. తాజాగా యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. తొలి పోరులో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
-
You the mannnnnn 💪💪💪@nagalsumit
— Rohan Bopanna (@rohanbopanna) August 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Qualifying into the main draw of the @usopen @kirrenrijju @IndianOilcl @IndianOil_Delhi 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/Bnrhg2TQUk
">You the mannnnnn 💪💪💪@nagalsumit
— Rohan Bopanna (@rohanbopanna) August 23, 2019
Qualifying into the main draw of the @usopen @kirrenrijju @IndianOilcl @IndianOil_Delhi 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/Bnrhg2TQUkYou the mannnnnn 💪💪💪@nagalsumit
— Rohan Bopanna (@rohanbopanna) August 23, 2019
Qualifying into the main draw of the @usopen @kirrenrijju @IndianOilcl @IndianOil_Delhi 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/Bnrhg2TQUk
యూఎస్ ఓపెన్ -2019కు అర్హత సాధించిన రెండో భారతీయ ఆటగాడు సుమిత్. 89వ ర్యాంకులో ఉన్న ప్రజ్నేష్ గున్నేశ్వరన్ ఇప్పటికే మెయిన్ డ్రాలో స్థానం సంపాందించాడు.
ఇవీ చూడండి.. అశ్విన్ రికార్డును తిరగరాసిన పేసర్ బుమ్రా