యూఎస్ ఓపెన్‌లో అమెరికాకు చెందిన డబుల్స్ ఆటగాడు మైక్ బ్రయాన్.. తన రాకెట్‌ను తుపాకీలా పట్టుకుని రిఫరీ వైపు చూపించిన కారణంగా అతడికి 10 వేల డాలర్ల భారీ జరిమానా పడింది.
బాబ్, బ్రయాన్ ద్వయం... యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో రాబర్టో కార్బెల్లెస్-ఫెడెరికో డెల్బోనిస్పై 4-6, 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేత నిర్ణయంపై.. బాబ్, బ్రయాన్ సమీక్ష కోరారు. అది కాస్త విజయవంతం కావడం వల్ల రాకెట్‌ను గన్లా పట్టుకుని అతడికి గురిపెట్టినట్లు ఫోజ్ ఇచ్చాడు బ్రయాన్. ఈ విషయంతో బ్రయాన్‌కు 10 వేల డాలర్లు జరిమానా పడింది. ఈ టోర్నీలో ఓ పురుష ఆటగాడికి ఇదే భారీ జరిమానా. అనంతరం ఈ విషయంపై పశ్చాత్తపం వ్యక్తం చేశాడీ ఆటగాడు.
-
Playful gesture went wrong. Tennis player #MikeBryan slammed with highest fine ever $10, 000 for unwanted gesture towards the judge. Thanks to @DaniilMedwed for kicking off the offence string at @usopen 😏✋🚨@Bryanbrothers via @usopen @IndTennisDaily #MondayMood pic.twitter.com/IPac2n7fDY
— Indian Sports Fan (@IndianSportFan) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Playful gesture went wrong. Tennis player #MikeBryan slammed with highest fine ever $10, 000 for unwanted gesture towards the judge. Thanks to @DaniilMedwed for kicking off the offence string at @usopen 😏✋🚨@Bryanbrothers via @usopen @IndTennisDaily #MondayMood pic.twitter.com/IPac2n7fDY
— Indian Sports Fan (@IndianSportFan) September 2, 2019Playful gesture went wrong. Tennis player #MikeBryan slammed with highest fine ever $10, 000 for unwanted gesture towards the judge. Thanks to @DaniilMedwed for kicking off the offence string at @usopen 😏✋🚨@Bryanbrothers via @usopen @IndTennisDaily #MondayMood pic.twitter.com/IPac2n7fDY
— Indian Sports Fan (@IndianSportFan) September 2, 2019
"నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నా. పాయింట్ గెలిచిన ఆనందంలో మాత్రమే అలా చేశా. కొంత కాలంగా సంభవిస్తున్న పరిస్థితులను చూస్తే అది తప్పని అర్థమయింది. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా". -బ్రయాన్, అమెరికా డబుల్స్ ఆటగాడు
టెక్సాస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఈ ఏడాది యూఎస్‌లో పలుమార్లు కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కారణంగా యూఎస్ ఓపెన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఇవీ చూడండి.. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్