ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​: రెండో రౌండ్​ చేరిన నాదల్​ - Rafael Nadal

ప్రఖ్యాత గ్రాండ్​స్లామ్​ టోర్నీ యూఎస్​ ఓపెన్​లో రఫేల్​ నాదల్​ ముందంజ వేశాడు. మెదటి రౌండ్​లో ఆస్ట్రేలియా క్రీడాకారుడు జాన్​ మిల్మాన్​ (ఆస్ట్రేలియా)ను ఓడించి రెండో రౌండ్​కు అర్హత సాధించాడు.

రఫేల్​ నాదల్
author img

By

Published : Aug 28, 2019, 11:54 AM IST

Updated : Sep 28, 2019, 2:09 PM IST

స్పెయిన్​ బుల్​ రఫేల్​ నాదల్​ యూఎస్​ ఓపెన్​లో రెండో రౌండ్​కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్​లో మిల్మాన్​​(ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. గతేడాది ఇదే టోర్నీలో రోజర్​ ఫెదరర్​కు మిల్మాన్ షాకివ్వడం వల్ల ఈ మ్యాచ్​పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆరంభం నుంచే ఆటలో దూకుడు చూపించిన నాదల్... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. ప్రత్యర్థిని 6-3, 6-3, 6-2 తేడాతో ఓడించాడు. మిల్మాన్​కు అస్త్రాలైన ఫోర్‌ హ్యాండ్, బ్యాక్‌ హ్యాండ్ షాట్​లను ఆడనివ్వకుండా కట్టడి చేశాడు.

ఇప్పటికే మూడు సార్లు యుఎస్​ ఓపెన్​ విజేతగా నిలిచాడీ స్పెయిన్​ దిగ్గజం. ఆగస్టు 29న జరిగే రెండో రౌండ్​లో ఆస్ట్రేలియా ఆటగాడు​ కొకినాకిస్​తో తలపడనున్నాడు నాదల్​.
ఈ టోర్నీలోనే మరో మ్యాచ్​లో టెన్నిస్​ దిగ్గజాలు థామస్ ఫాబియానో, డొమినిక్ థీమ్​లు తలపడ్డారు. ప్రపంచ నెం.4 థీమ్​కు షాకిస్తూ 6-4, 3-6, 6-3, 6-2 తేడాతో గెలిచాడు ఫాబియనో.

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.