యూఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో మరోసారి అనుభవజ్ఞుడికే టైటిల్ దక్కింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనలో స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్.. ఈ టోర్నీలో నాలుగోసారి విజేతగా నిలిచాడు. రష్యాకు చెందిన డేనియల్ మెద్వదేవ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 పాయింట్ల తేడాతో ఓడించి కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరు.. ఈ టోర్నీ చరిత్రలో ఎక్కువసేపు జరిగిన మూడో ఫైనల్‌గా నిలిచింది.
ప్రపంచ నంబర్.2 రఫా.. ఇందులో ఛాంపియన్‌గా నిలిచినందుకు 3.85 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు 2010, 2013, 2017లో యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గాడీ ప్లేయర్.
33 ఏళ్ల నాదల్.. 19 సార్లు గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచి, అత్యధిక టైటిల్స్ అందుకున్న వారిలో రెండోస్థానంలో ఉన్నాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(20) ఇతడి కంటే ముందున్నాడు. ఐదోసారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడిన స్పెయిన్‌బుల్.. 27వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో పాల్గొన్నాడు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఐదు టైటిల్స్ అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు.
ఇది చదవండి: సెరెనాకు షాక్- యూఎస్ ఓపెన్ గెలిచిన ఆండ్రిస్కూ