ఓ వైపు కరోనా భయాలు.. మరోవైపు కఠిన క్వారంటైన్ గడిపిన ఆటగాళ్లు.. ఇంకోవైపు దిగ్గజాలను దాటి విజేతలుగా నిలవాలనే యువ ప్లేయర్ల ఆకాంక్షలు.. ఈ పరిస్థితుల నడుమ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫిబ్రవరి 8(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. 21న ఫైనల్ జరగనుంది. పద్నాలుగు రోజుల పాటు అభిమానులకు టెన్నిస్ మజాను అందించేందుకు దిగ్గజాలతో పాటు యువ ప్లేయర్లు సిద్ధమయ్యారు. కరోనా ఆంక్షల నడుమ మ్యాచ్‌లు వీక్షించేందుకు ప్రతి రోజు 30 వేల మందిని మైదానంలోకి అనుమతించనున్నారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ సింగిల్స్ మెయిన్ డ్రాలో పోటీ పడేందుకు 16 మంది పురుషులు, 16 మంది మహిళా ప్లేయర్లు అర్హత సాధించారు.
తొలి రోజు ఆట
- తొలి రౌండ్లో మొదటి మ్యాచ్ ఉదయం 5.30 గంటలకు.. స్టార్ ప్లేయర్స్ నొవాక్-మన్నారిన్నో మధ్య పోరుతో ప్రారంభం అవుతుంది. అదే సమయంలో మౌటెట్- మిల్మన్, మోన్ఫిల్స్- ఎమిల్ రుసువోరి, రావోనిక్-కొరియా, తలపడనున్నారు.
- మధ్యాహ్నం 2.45గంటలకు జకోవిచ్-చార్డీ, షాపొవాలోవ్-సిన్నర్ మధ్య పోరుతో తొలి రోజు ఆట పూర్తవుతుంది.
- తొలి రోజు ఆటలో జకోవిచ్ మినహా అందరూ యువ ఆటగాళ్లు మాత్రమే తలపడనున్నారు.
మహిళల విభాగంలో
- తొలి రౌండ్లో 5.30 గంటలకు వెడోవా-గోర్గీ, ఓసాకా- పవ్లీయుచెన్కోవా , మరినో-బిరెల్, దియాస్-జిడన్సెక్, బెగు-స్టొజనోవిక్, విలియమ్స్-ఫ్లిప్కెన్స్, హెర్కాగ్-గార్సియా మధ్య మ్యాచులతో ప్రారంభంమవుతుంది.
- 6.45గంటలకు స్టార్ ప్లేయర్ విలియమ్స్, సిగ్మిండ్తో తలపడనుంది.
- మధ్యాహ్నం 1.30 గంటలకు కాబ్రెరా- హలెప్ మధ్య పోరుతో తొలి రోజు ఆట పూర్తవుతుంది.
- తొలి రోజు ఆటలో భారత ఆటగాళ్లు ఎవరూ లేరు.
- స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్.. 2021 ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇటీవల అతడికి మోకాలి శస్త్రచికిత్స జరగడమే ఇందుకు కారణం.
- సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జనవరి 18న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం అవ్వాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.
- ఈ సారి 'ఆస్ట్రేలియన్ ఓపెన్' ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 13.6 శాతం ఎక్కువైంది. ఈ విషయాన్ని టోర్నీ డైరెక్టర్ క్రేగ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: 8 వేళ్లతో టెన్నిస్ ఆడేస్తోంది