ETV Bharat / sports

కొడుకుతో సరదాగా సానియా మీర్జా - కొడుకుతో సరదాగా సానియా

తన కుమారుడు ఇజాన్ మీర్జాతో కలిసి సరదాగా సమాయాన్ని గడుపుతోంది టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. క్రమం తప్పకుండా తన కుమారుడితో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది ఈ స్టార్​ ప్లేయర్​.

Sania Mirza
కొడుకుతో సరదాగా 'సానియా'
author img

By

Published : Dec 4, 2020, 8:20 AM IST

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జాతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది. అతడి చిన్నారి చిలిపి చేష్టలను విపరీతంగా ఆనందిస్తోంది. అతడితో కలిసి ఆడుతూ పాడుతూ సరదగా కాలం గడుపుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె క్రమం తప్పకుండా సోషల్‌మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కుమారుడితో కలిసి దిగిన చిత్రాన్ని ఆమె ఇన్‌స్టాలో పెట్టారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

Sania Mirza
కొడుకుతో సానియా

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రస్తుతం టెన్నిస్‌ టోర్నీల్లో సానియా ఎక్కువగా పాల్గొనడం లేదు. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన ఆమె కుమారుడికి జన్మనిచ్చాక 23 కిలోల బరువు తగ్గింది. ఎన్నో కష్టమైన కసరత్తులు చేసి, కఠినమైన ఆహారపు నిబంధనలు పాటించింది. మొదట్లో మళ్లీ టెన్నిస్‌ ఆడతాననుకోలేదని అయితే తనకిష్టమైన ఆటకోసం అలుపెరగక శ్రమించానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గర్భధారణ, మాతృత్వం, కెరీర్‌ గురించి భావోద్వేగంతో ఆమె ఈ మధ్యే ఓ లేఖను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఇదీ చదవండి:'అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమేం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.