ఆస్ట్రేలియన్ ఓపెన్లో కరోనా కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. దీంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆటగాళ్ల సంఖ్య 72కి చేరింది. ఫిబ్రవరి 8న టోర్నీ జరగనున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం కలకలం రేపుతోంది.
ఖతార్ దోహా నుంచి ఆతిథ్య దేశానికి వచ్చిన విమానంలో తాజాగా కొవిడ్ కేసు వెలుగు చూసింది. ఇందులో 25 మంది ఆటగాళ్లు సహా మొత్తం 58 మంది ఉన్నారు. వారందరూ ప్రస్తుతం హోటల్ గదులకే పరిమితమయ్యారు. వీరిని 14 రోజుల పాటు బయటకు అనుమతించమని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.
ఇప్పటికే 47 మంది ప్లేయర్లు క్వారంటైన్లో ఉన్నారు. ముప్పు తక్కువగా ఉన్న ప్లేయర్ల ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం రోజూ ఐదు గంటల సమయాన్ని ఇవ్వనున్నట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా 294 ఆలౌట్.. భారత్ లక్ష్యం 328