ETV Bharat / sports

ఆరు నెలల తర్వాత కోర్టులోకి సెరెనా విలియమ్స్ - Serena Williams news

స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. దాదాపు ఆరు నెలల తర్వాత కోర్టులో అడుగుపెట్టనుంది. నేటి నుంచి జరిగే టాప్ సీడ్​ ఓపెన్​లో పాల్గొనుంది.

ఆరు నెలల తర్వాత కోర్టులోకి సెరెనా
స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్
author img

By

Published : Aug 10, 2020, 7:41 AM IST

ఆరు నెలల విరామం తర్వాత అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మళ్లీ కోర్టులోకి రాబోతోంది. సోమవారం(ఆగస్టు 10) నుంచి ఆరంభమయ్యే టాప్‌ సీడ్‌ ఓపెన్​లో బరిలో దిగనుంది. చివరిగా ఫిబ్రవరిలో జరిగిన ఫెడ్‌కప్‌లో ఆడిన 38 ఏళ్ల సెరెనా.. ఇటీవలే ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. కరోనా వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెరెనాతో పాటు ఆమె సోదరి వీనస్‌ విలియమ్స్‌, విక్టోరియా అజరెంక, స్లోన్‌ స్టీఫెన్స్‌, కొకో గాఫ్‌ లాంటి స్టార్లు పాల్గొంటున్నారు. ఈనెల 31న ప్రారంభమయ్యే యుఎస్‌ ఓపెన్‌కు ఈ ఛాంపియన్‌షిప్‌ను సన్నాహక టోర్నీగా నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్న సెరెనా.. ఈ టోర్నీలో బరిలో దిగడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

"నా బృందం అంతా ఓ బుడగలోనే ఉంటుంది. ఆరోగ్యానికే ప్రధానంగా ప్రాముఖ్యత ఇస్తున్నా" అని సెరెనా చెప్పింది. 2017లో అమ్మాయికి జన్మనిచ్చిన విలియమ్స్‌.. పునరాగమనంలో (2018) వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్లో ఫైనల్‌ చేరినా టైటిల్‌ గెలవలేకపోయింది. ఈసారి యుఎస్‌ ఓపెన్‌ నెగ్గి మార్గరేట్‌ కోర్ట్‌ (24) అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేయాలనేది ఈ అమెరికా తార లక్ష్యం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.