ETV Bharat / sports

యుఎస్​ ఓపెన్​: సెమీస్​కు సెరెనా, ఒసాకా - నవోమి ఒసాకా యూఎస్​ ఓపెన్

యుఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ మరో అడుగు ముందుకేసింది. ఆసక్తికర పోరులో పిరన్కోవాను ఓడించి, సెమీస్​‌కు దూసుకెళ్లింది. యువ కెరటం నవోమి ఒసాకా కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ జ్వెరెవ్‌ తుది నాలుగులోకి ప్రవేశించాడు. జకోవిచ్‌పై వేటు పడడం వల్ల క్వార్టర్స్‌ చేరిన పాబ్లో.. అదే ఉత్సాహంతో షపోవలోవ్‌కు షాకిచ్చాడు.

Serena Williams, Daniil Medvedev book spots in US Open semi-finals
యుఎస్​ ఓపెన్​: సెమీస్​కు సెరెనా, ఒసాకా
author img

By

Published : Sep 10, 2020, 6:51 AM IST

కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం తహతహలాడుతున్న సెరెనా విలియమ్స్‌ (అమెరికా) యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సెరెనా 4-6, 6-3, 6-2తో పిరన్కోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా.. రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే సర్వీసును చేజార్చుకుని చిక్కుల్లో పడింది. పిరన్కోవా గెలిచేలా కనిపించింది. కానీ సెరెనా బలంగా పుంజుకుని రెండో సెట్‌ను చేజిక్కుంచుకుంది. మూడో సెట్‌ ఆరంభంలోనే బ్రేక్‌ సాధించి అలవోకగా పైచేయి సాధించింది.

ఒసాకా ఆధిపత్యం

ఇక నాలుగో సీడ్‌ ఒసాకాకు ఎదురులేకుండా పోయింది. టోర్నీ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న ఆమె క్వార్టర్స్‌లోనూ దూకుడు కొనసాగించింది. ఒసాకా 6-3, 6-4 తేడాతో షెల్బీ రోజర్స్‌ (యుఎస్‌ఏ)ను ఓడించింది. ప్రపంచ 93వ ర్యాంకు క్రీడాకారిణి రోజర్స్‌తో మ్యాచ్‌లో జోరు ప్రదర్శించిన తొమ్మిదో ర్యాంకర్‌ ఒసాకా వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలి సెట్‌ ఆరంభంలో పోరు హోరాహోరీగా సాగింది. స్కోరు 2-2తో సమమైంది. కానీ అక్కడినుంచి ఒసాకా దూకుడు పెంచింది. ఆమె వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత రోజర్స్‌ ఒక గేమ్‌ గెలిచినప్పటికీ.. పదునైన సర్వీసులు, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన ఒసాకా మిగతా గేమ్‌లు నెగ్గి సెట్‌ సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ అదే ఆధిపత్యం కొనసాగించి మ్యాచ్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె 7 ఏస్‌లు, 24 విన్నర్లు కొట్టింది. సెమీస్‌లో ఆమె.. బ్రాడీ (యుఎస్‌ఏ)తో తలపడనుంది.

Serena Williams, Daniil Medvedev book spots in US Open semi-finals
యుఎస్​ ఓపెన్​ సెమీస్​

పాబ్లో పోరాటం

ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 20వ సీడ్‌ పాబ్లో (స్పెయిన్‌) 3-6, 7-6 (7/5), 7-6 (7/4), 0-6, 6-3తో పన్నెండో సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా)పై పోరాడి నెగ్గాడు. 4 గంటల 8 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను షపోవలోవ్‌ పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌ నుంచి అసలు పోరాటం మొదలైంది. ఇద్దరూ పోటీపోటీగా తలపడడం వల్ల ఆ తర్వాతి రెండు సెట్ల ఫలితం టేబ్రేకర్‌లో తేలింది. కీలక సమయాల్లో పట్టు వదలకుండా ప్రయత్నించిన పాబ్లో ఆ రెండు సెట్లలో నెగ్గాడు. కానీ నాలుగో సెట్లో అనూహ్యంగా పుంజుకున్న షపోవలోవ్‌ ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా గెలిచాడు. దీంతో నిర్ణయాత్మక సెట్‌ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందనిపించింది. కానీ అనవసర తప్పిదాలతో షపోవలోవ్‌ వెనకపడ్డాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న పాబ్లో విజయం వైపు నిలిచాడు. 76 అనవసర తప్పిదాలు చేయడం షపోవలోవ్‌ను దెబ్బతీసింది. సెమీస్‌లో జ్వెరెవ్‌తో పాబ్లో పోటీపడనున్నాడు.

జ్వెరెవ్​

మరోవైపు దిగ్గజ త్రయం (ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌) పోటీలో లేకపోవడం వల్ల టైటిల్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్న జ్వెరెవ్‌ (జర్మనీ) సెమీస్‌లో అడగుపెట్టాడు. క్వార్టర్స్‌లో అతను 1-6, 7-6 (7/5), 7-6 (7/1), 6-3తో 27వ సీడ్‌ కొరిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ చేరిన కొరిచ్‌ ఈ మ్యాచ్‌ తొలి సెట్‌లో సంపూర్ణ ఆధిపత్యం చలాయించాడు. ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి సెట్‌ గెలిచిన అతను జ్వెరెవ్‌కు షాకిచ్చేలా కనిపించాడు. అయితే తిరిగి పుంజుకున్న జ్వెరెవ్‌ విజయం కోసం గొప్పగా పోరాడాడు. ఆటగాళ్లు ఇద్దరూ హోరాహోరీగా తలపడడం వల్ల టైబ్రేకర్‌కు దారితీసిన రెండు, మూడు సెట్లను జ్వెరెవ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే హుషారుతో నాలుగో సెట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అతను 18 ఏస్‌లు, 52 విన్నర్లు కొట్టాడు. కొరిచ్‌ 41 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.