అనారోగ్యం కారణంగా ఇండోనెేసియా ఓపెన్‌కు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్ ఓపెన్‌కూ అందుబాటులోకి రావట్లేదు. మొదట జపాన్‌లో ఆడుతుందని అందరూ భావించారు. అయితే వచ్చే నెలలో ఉన్న వరల్డ్ ఛాంపియన్షిప్స్ దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
-
#Badminton : P V Sindhu to play at #JapanOpenSuper750 on Wednesday while Saina Nehwal has pulled out of the tournament at the last minute as she is more focused on getting into shape for the World Championships next month pic.twitter.com/ZB4CMaIvXO
— Doordarshan Sports (@ddsportschannel) July 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Badminton : P V Sindhu to play at #JapanOpenSuper750 on Wednesday while Saina Nehwal has pulled out of the tournament at the last minute as she is more focused on getting into shape for the World Championships next month pic.twitter.com/ZB4CMaIvXO
— Doordarshan Sports (@ddsportschannel) July 23, 2019#Badminton : P V Sindhu to play at #JapanOpenSuper750 on Wednesday while Saina Nehwal has pulled out of the tournament at the last minute as she is more focused on getting into shape for the World Championships next month pic.twitter.com/ZB4CMaIvXO
— Doordarshan Sports (@ddsportschannel) July 23, 2019
ఈ ఏడాది వరుస గాయాలతో ముఖ్య టోర్నీలకు దూరమైంది సైనా. మడమ మొదలు మణికట్టు గాయం వరకు వరుస ఇబ్బందులతో సతమతమైంది. క్లోమగ్రంథి సమస్యతో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటలేకపోయింది.
ఏప్రిల్‌లో కోలుకున్న సైనా ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గింది. ఈ సీజన్లో టైటిల్ గెలిచిన ఏకైక క్రీడాకారిణి సైనానే. తర్వాత ఫిట్నెస్ లేమితో ఇండోనేసియా ఓపెన్‌కు దూరమైంది. గతంలో ఈ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గింది సైనా.
ప్రస్తుతం జపాన్ ఓపెన్‌లో సింధుపైనే ఆశలు పెట్టుకుంది భారత్. ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు వచ్చిన సింధు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో పరాజయం చెందింది. ప్రస్తుతం జపాన్ ఓపెన్‌లో ఎలాగైన గెలిచి టైటిల్ ఆకలి తీర్చుకోవాలని అనుకుంటోంది.
ఇది చదవండి: టెస్టుల్లో కోహ్లీ అగ్రస్థానం పదిలం