ETV Bharat / sports

ఒలింపిక్స్​కు స్విస్​ దిగ్గజం ఫెదరర్ దూరం - Roger federer ఒలింపిక్స్​ ఔట్​

టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకొంటున్నట్లు మరో టెన్నిస్ స్టార్ రోజర్​ ఫెదరర్​ ప్రకటించాడు. తన మోకాలికి గాయం అవ్వడం వల్ల విశ్వక్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు.

federer
ఫెదరర్
author img

By

Published : Jul 13, 2021, 10:14 PM IST

టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకొంటున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​ ఈ మెగాక్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశాడు. వింబుల్డన్​ టోర్నీ ఆడుతున్న సమయంలో తన మోకాలికి గాయం అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

ఒలింపిక్స్​ ఇక ఆడడా?

ఫెదరర్​ ఇక ఒలింపిక్స్​ ఆడే అవకాశాలు పెద్దగా లేకపోవచ్చు. రోజర్​కు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఇప్పటికే అతడిని గాయాలు వేధిస్తున్నాయి. ఇంకా.. చాలా ఏళ్లుగా మేజర్ టోర్నీ టైటిళ్లను నెగ్గలేదు. మళ్లీ వచ్చే ఒలింపిక్స్ వరకు అతడు ఫామ్ లో ఉండటం కష్టమే.

ఇదీ చదవండి:wimbledon: సెమీస్​కు జకోవిచ్​.. ఫెదరర్​, మీర్జా-బోపన్న ఇంటికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.