ETV Bharat / sports

ఒలింపిక్స్​కు ఫెదరర్​ దూరం! - టోక్యో ఒలింపిక్స్

టెన్నిస్ స్టార్ రోజర్​ ఫెదరర్​.. టోక్యో ఒలింపిక్స్​కు దూరమయ్యే అవకాశం ఉంది. వింబుల్డన్ అనంతర పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు అతడు తెలిపాడు.

roger federer olympics
రోజర్ ఫెదరర్
author img

By

Published : Jun 27, 2021, 5:53 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పాల్గొనడం అనుమానంగానే ఉంది. సోమవారం (జూన్ 28) నుంచి జరగనున్న వింబుల్డన్​ పూర్తి అయిన తర్వాతే ఒలింపిక్స్​పై స్పష్టత వస్తుందని ఫెదరర్ శనివారం ప్రకటించాడు. వచ్చే రెండు వారాల్లో పరిస్థితులను బట్టి తన నిర్ణయం ఉంటుందని చెప్పాడు.

"ఒలింపిక్స్​లో ఆడతానని కచ్చితంగా చెప్పలేను. వింబుల్డన్​లో నా ప్రదర్శన వేసవి ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది. ఒలింపిక్స్​కు వెళ్లి, వీలైనన్ని ఎక్కువ టోర్నమెంట్లు ఆడాలని ఉంది. అయితే వింబుల్డన్ తర్వాత నా టీమ్​తో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటా"

- రోజర్ ఫెదరర్, టెన్నిస్ క్రీడాకారుడు

40 ఏళ్ల ఫెదరర్​ ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్​లో పతకం సాధించాడు. వింబుల్డన్.. జులై 11న ముగుస్తుంది. కాగా టోక్యో ఒలింపిక్స్​ జులై 23న మొదలవుతుంది. ఒలింపిక్స్​ నుంచి ఇప్పటికే మరో స్టార్ ప్లేయర్​ నాదల్ తప్పుకున్నాడు.

ఇదీ చూడండి: Wimbledon: వింబుల్డన్​ నుంచి వైదొలిగిన హలెప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.