ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్-100 జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. ఫోర్బ్స్ శుక్రవారం వెల్లడించిన ఈ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లీ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే అతడు 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. నిరుటిలానే ఈసారి కోహ్లీ తప్ప భారత్ నుంచి మరే అథ్లెట్‌కు ఈ జాబితాలో చోటు లభించలేదు. మరోవైపు స్విస్ టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ కెరీర్‌లోనే తొలిసారిగా రూ.801 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ జాబితాలో టెన్నిస్ ఆటగాడు అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి! ఫుట్‌బాల్ సూపర్‌స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్, రూ.794 కోట్లు) ద్వితీయ, లియొనెల్ మెస్సి (అర్జెంటీనా, రూ.786 కోట్లు) తృతీయ స్థానాలు సాధించారు. మొత్తం 100 మంది జాబితాలో 35 మంది బాస్కెట్‌బాల్ ఆటగాళ్లు ఉన్నారు.
ఫెదరర్ టాప్లో.. కోహ్లీకి 66వ ర్యాంక్ - ఫెదరర్ తాజా వార్తలు
అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో తొలిసారి ఓ టెన్నిస్ ప్లేయర్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. భారత్ నుంచి కోహ్లీకి మాత్రమే ఇందులో చోటు లభించింది.