టోక్యో ఒలింపిక్స్(Olympics)కు టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదర్, రఫెల్ నాదల్ దూరమైన నేపథ్యంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic). ఒలింపిక్స్‌లో తాను పాల్గొనబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అయితే అది ఓ ఆరేళ్ల బుడతడికోసమేనట.
-
Cannot disappoint my little friend Koujirou. I booked my flight for Tokyo and will proudly be joining #TeamSerbia for the Olympics. 🇷🇸 pic.twitter.com/23TmSdvc4x
— Novak Djokovic (@DjokerNole) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cannot disappoint my little friend Koujirou. I booked my flight for Tokyo and will proudly be joining #TeamSerbia for the Olympics. 🇷🇸 pic.twitter.com/23TmSdvc4x
— Novak Djokovic (@DjokerNole) July 15, 2021Cannot disappoint my little friend Koujirou. I booked my flight for Tokyo and will proudly be joining #TeamSerbia for the Olympics. 🇷🇸 pic.twitter.com/23TmSdvc4x
— Novak Djokovic (@DjokerNole) July 15, 2021
"నా చిన్నారి స్నేహితుడు కొజిరోను నిరాశపరచలేను. టోక్యోకు ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఒలింపిక్స్ కోసం సగర్వంగా సెర్బియా జట్టుతో కలవబోతున్నాను"
- నొవాక్ జకోవిచ్, టెన్నిస్ క్రీడాకారుడు
ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు జకో. అందులో కొజిరో ఒవాకీ అనే బాలుడికి 6వ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కనిపించాడు.
సూపర్ ఫామ్‌లో..
ఇటీవలే తన ఆరో వింబుల్డన్ టైటిల్ గెలిచిన జకో.. కెరీర్లో 20 గ్లాండ్స్లామ్లతో స్విస్ దిగ్గజం ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ దక్కించుకున్న సెర్బియన్ స్టార్.. యూఎస్ ఓపెన్ కూడా కైవసం చేసుకొని ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని చూస్తున్నాడు.
ఇదీ చూడండి: ప్చ్.. ఒలింపిక్స్‌లో ఈ స్టార్ ప్లేయర్స్‌ను చూడలేం!