ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సెరెనా విలియమ్స్(అమెరికా)పై నవోమి ఒసాకా(జపాన్) గెలుపొందింది. ఈ గ్రాండ్‌స్లామ్‌తో తన కెరీర్లో 24వ ట్రోఫీని దక్కించుకుని.. మార్గరెట్ కోర్టు రికార్టును సమం చేయాలన్న సెరెనా ఆశలను ఒసాకా ఆవిరి చేసింది. దీంతో ఈ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకోవాలన్న సెరెనా విలియమ్స్ ఆశయం నెరవేరలేదు.
-
Simply sensational ✨@naomiosaka sweeps past Serena Williams 6-3 6-4 & is our first #AO2021 women's singles finalist!#AusOpen pic.twitter.com/KsMUARKI3L
— #AusOpen (@AustralianOpen) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Simply sensational ✨@naomiosaka sweeps past Serena Williams 6-3 6-4 & is our first #AO2021 women's singles finalist!#AusOpen pic.twitter.com/KsMUARKI3L
— #AusOpen (@AustralianOpen) February 18, 2021Simply sensational ✨@naomiosaka sweeps past Serena Williams 6-3 6-4 & is our first #AO2021 women's singles finalist!#AusOpen pic.twitter.com/KsMUARKI3L
— #AusOpen (@AustralianOpen) February 18, 2021
గురువారం జరిగిన సెమీఫైనల్లో సెరెనా-ఒసాకా తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో వరుస సెట్లలో (6-3, 6-4) ఒసాకా విజయం పైచేయి సాధించి.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఇదే రోజు జరగనున్న మరో సెమీస్‌లో కరోలినా ముచోవా, జెన్నిఫర్ బ్రాడీ తలపడనున్నారు. ఈ మ్యాచ్ విజేతతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఒసాకా ఆడుతుంది. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో గతేడాది ఫిబ్రవరి నుంచి నవోమి ఒసాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నాదల్ ఔట్