ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​కు మరో స్టార్ టెన్నిస్​ ప్లేయర్​ దూరం

మరో స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ యూఎస్​ ఓపెన్ (US Open 2021) నుంచి వైదొలిగాడు. పాదానికి గాయం కారణంగా యూఎస్​ ఓపెన్​తో పాటు సీజన్​ మొత్తానికి దూరమవుతున్నట్లు ప్రకటించాడు​. ఇంతకి అతడు ఎవరంటే..

Rafael Nadal
రాఫెల్ నాదల్
author img

By

Published : Aug 20, 2021, 7:19 PM IST

స్పెయిన్​ టెన్నిస్ దిగ్గజం రాఫెల్​ నాదల్ (Rafael Nadal)​ యూఎస్​ ఓపెన్​కు (US Open 2021) దూరమయ్యాడు. కాలిగాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సీజన్​ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రకటించాడు. చివరిసారిగా వింబుల్డన్​ ఓపెన్​ సెమీస్​లో ఆడాడు నాదల్. ఆ మ్యాచ్​లో నొవాక్ జకోవిచ్​తో తలపడి ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన వింబుల్డన్​తో పాటు ఒలింపిక్స్​కు దూరమయ్యాడు.

"2021 సీజన్​లో టెన్నిస్​ ఆడలేకపోతున్నాను. ఇందుకు నన్ను క్షమించండి. నేను గత ఏడాది కాలంగా పాదం గాయంతో బాధపడుతున్నానని మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా ముఖ్యమైన టోర్నీలు కోల్పోయాను."

-రాఫెల్​ నాదల్​, స్టార్​ టెన్నిస్ ప్లేయర్​.

కాలి గాయం కారణంగా తీవ్రమైన నొప్పిని భరిస్తున్నానని నాదల్​ తెలిపాడు. "సరిగా ప్రాక్టీస్​ చేయలేకపోతున్నాను. అనుకున్న రీతిలో సన్నద్ధత కాలేకపోతున్నాను. ఇదేమీ కొత్త గాయం కాదు. 2005 నుంచి ఉన్నదే. కెరీర్​ ఆరంభంలో నా భవిష్యత్​ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ, నేను అనుకున్నది సాధించగలిగాను. నేను కచ్చితంగా ఈ గాయం నుంచి బయటపడతాను" అని రాఫా వెల్లడించాడు.

తన టెన్నిస్​ జీవితంలో మరికొన్ని అద్భుతమైన విజయాలు పొందుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు నాదల్​. అందుకే ప్రతిరోజు పోరాడుతున్నానని తెలిపాడు. నాదల్​ ఇప్పటివరకు 20 గ్రాండ్​స్లామ్​లను గెలుచుకున్నాడు. ఈ ఏడాది బార్సిలోనాతో పాటు రోమ్​ టోర్నీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

గాయం కారణంగా ఇప్పటికే రోజర్​ ఫెదరర్​ కూడా యూఎస్​ ఓపెన్​కు దూరమయ్యాడు. అతడి మోకాలికి మరో సర్జరీ చేయనున్నట్లు అతడు ప్రకటించాడు.

ఇదీ చదవండి: ఫెదరర్​కు మరో సర్జరీ.. యూఎస్​ ఓపెన్​కు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.