ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్ సెమీస్​లో నాదల్​ - రఫెల్ నాదల్

ఇటాలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ రఫెల్ నాదల్ ప్రవేశించాడు. క్వార్టర్​ ఫైనల్లో అలెగ్జాండర్​ జ్వెరెవ్​పై 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు.

rafel nadal, spain tennis player
రఫెల్ నాదల్, స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు
author img

By

Published : May 15, 2021, 7:40 AM IST

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌.. ఇటాలియన్‌ ఓపెన్​లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6-3, 6-4తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. గత వారం మాడ్రిడ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో జ్వెరెవ్‌ చేతిలో ఓడిన రఫా.. ఈసారి అతడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఇటాలియన్‌ ఓపెన్‌ గెలిచిన రఫా.. సెమీస్‌లో ఒపెల్కా (అమెరికా)తో తలపడనున్నాడు. మరో పోరులో ఒపెల్కా 7-5, 7-6 (7/2)తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), కొకోగాఫ్‌ (అమెరికా) సెమీఫైనల్‌ చేరారు. క్వార్టర్స్‌లో ప్లిస్కోవా 4-6, 7-5, 7-6 (7/1)తో ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. కోకో గాఫ్‌తో మ్యాచ్‌లో టాప్‌సీడ్‌ బార్టీ 6-4, 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది.

ఇదీ చదవండి: జట్టు కోసం ఏదైనా చేస్తా: హనుమ విహారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.