ETV Bharat / sports

french open: నాదల్​.. అడుగేస్తే అందలం!

ప్రపంచ టెన్నిస్‌లో దిగ్గజం ఎవరంటే.. ఎక్కువ మంది చెప్పే పేరు రోజర్‌ ఫెదరర్‌(Federer). అద్వితీయమైన ఆటతో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న ఈ స్విస్‌ వీరుడు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో శిఖరాగ్రాన నిలిచి చరిత్ర సృష్టించాడు. అతని జోరు చూసి మరే ఆటగాడూ తనకు చేరువగా రాడని అంతా అనుకున్నారు. కానీ స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకొచ్చాడు. దూకుడైన ఆటతో విజయాల వేట కొనసాగించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డులో ఫెదరర్‌ సరసన చేరి అసాధ్యమనుకున్నది అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ దిగ్గజాన్ని వెనక్కినెట్టి.. టెన్నిస్‌ మహా వీరుడిగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ గెలిస్తే టెన్నిస్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నవాడవుతాడు.

nadal
నాదల్
author img

By

Published : May 29, 2021, 7:33 AM IST

ఆటల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ దాటేస్తూ.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడతాడు. ఇక ఎవరూ అతణ్ని చేరుకోలేరని అంచనా వేస్తారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసేందుకు మరో ఆటగాడు వస్తాడు. అప్పటివరకూ ఉన్న రికార్డుల దుమ్ము దులుపుతాడు. ఆటగాళ్లు ఆడిన పరిస్థితులు వేరైనా.. ఎదుర్కొన్న సవాళ్లు విభిన్నమైనవైనా క్రీడల్లో కొత్త రికార్డులు నమోదవడం సహజమే. ఇది నిరంతర ప్రక్రియ. ఇక టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్‌ విషయానికి వస్తే ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం నాదల్‌(rafael nadal) ముందు వచ్చి వాలింది. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో ఫెదరర్‌(roger federer) తో పాటు సమానంగా ఉన్న అతను.. ఇంకొక్క టైటిల్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో దిగ్గజాన్ని దాటినవాడవుతాడు. ఆ ఘనత అందుకునేందుకు అతనికి అనువైన అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయం కోసం అతను బరిలో దిగబోతుంది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో(Fench Open) మరి! తనకు పెట్టని కోట అయిన ఈ టోర్నీలో అతనికి పెద్దగా సవాలు ఎదురయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే ఇక్కడ 13 సార్లు జెండా ఎగరేసిన అతనికి.. మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఆ తేడాను చెరిపి..

ఒకానొక దశలో ఫెదరర్‌, నాదల్‌కు మధ్య గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉండేది. 2003లో తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని అందుకున్న ఫెదరర్‌.. అక్కడి నుంచి తిరుగులేని ఆటతో ఆధిపత్యం చెలాయించాడు. 2005లో గ్రాండ్‌స్లామ్‌లో మొదటి టైటిల్‌ గెలుపు రుచి చూసిన నాదల్‌ మరోవైపు నుంచి దూసుకొచ్చాడు. అయినప్పటికీ 2009లో 15వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పీట్‌ సంప్రాస్‌ (14 టైటిళ్లు) రికార్డును ఫెదరర్‌ చెరిపేసే సమయానికి.. నాదల్‌ సాధించిన టైటిళ్ల సంఖ్య 6 మాత్రమే. కానీ ఆ తర్వాత గాయాలు, ఇతర కారణాలతో ఫెదరర్‌ కెరీర్‌ కాస్త నెమ్మదించగా.. ఆ అవకాశాన్ని అందుకున్న నాదల్‌ విజయాలతో సాగాడు. కానీ 2017కు ముందు వరకూ ఫెదరర్‌ కంటే నాదల్‌ మూడు టైటిళ్లు వెనకే నిలిచాడు. కానీ ఆ తర్వాత మూడేళ్లలో ఫెదరర్‌ మూడు టైటిళ్లు గెలిస్తే.. నాదల్‌ ఏకంగా అయిదు సార్లు విజేతగా నిలిచాడు. ఇక గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) నెగ్గడం ద్వారా పదకొండేళ్లకు పైగా గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో ఫెదరర్‌ సాగించిన ఆధిపత్యానికి గండి కొట్టాడు. ఈ సారి అదే ఎర్రమట్టి కోర్టులో మరోసారి విజేతగా నిలిచి అతణ్ని దాటుతాడేమో చూడాలి. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌దే పెత్తనమైనప్పటికీ దిగ్గజంగా మాత్రం ఎక్కువ మంది ఫెదరర్‌నే పేర్కొంటారు. కానీ ఇప్పుడతణ్ని దాటేందుకు నాదల్‌ ఒక్క టైటిల్‌ దూరంలో ఉన్నాడు. ఈ సారి రొలాండ్‌ గారోస్‌లో సరికొత్త చరిత్ర నమోదవుతుందా? లేదా? ఆ ఘనత కోసం నాదల్‌ మరికొంత కాలం ఎదురు చూడాల్సి వస్తుందా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇదీ చూడండి ఒలింపిక్స్​పై అనుమానాలు.. రద్దు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.