ETV Bharat / sports

French Open: సెమీస్​కు దూసుకెళ్లిన నాదల్​ - డియోగో స్క్వార్ట్జ్​మన్

ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లోకి దూసుకెళ్లాడు రఫెల్ నాదల్. క్వార్టర్స్​లో డియోగో స్క్వార్ట్జ్​మన్​తో జరిగిన మ్యాచ్​ను 6-3, 4-6, 6-4, 6-0తో గెలుపొందాడు రఫా. తన తదుపరి మ్యాచ్​లో జకోవిచ్​తో లేదా మాటియో బెరెట్టితో తలపడనున్నాడు రఫా.

rafel nadal, spain star tennis player
రఫెల్ నాదల్, స్పెయన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్​
author img

By

Published : Jun 9, 2021, 10:46 PM IST

స్పెయిన్​ టెన్నిస్ స్టార్​ రఫెల్​ నాదల్​ ఫ్రెంచ్ ఓపెన్​ సెమీ​ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ సీజన్​లో తొలిసారి ఓ సెట్​ ఓటమిని చవి చూశాడు రఫా. బుధవారం పదో సీడ్ ఆటగాడు డియోగో స్క్వార్ట్జ్​మన్​తో జ​రిగిన మ్యాచ్​లో 6-3, 4-6, 6-4, 6-0 తేడాతో విజయం సాధించాడు.

ఈ మ్యాచ్​లో రెండో సెట్​ను కోల్పోయిన నాదల్​.. ఈ సీజన్​లో తొలిసారి ఓ సెట్​ను కోల్పోయాడు. అనంతరం మూడో సెట్​లోనూ 4-3తో వెనుకంజ వేశాడు. ఆ తర్వాత పుంజుకున్న రఫెల్​.. వరుసగా 9 గేమ్​లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో మ్యాచ్​ను కూడా గెలుపొందాడు. సెమీస్​లో నొవాక్ జకోవిచ్​, లేదా తొమ్మిదో సీడ్ ప్లేయర్​ మాటియో బెరెట్టితో తలపడనున్నాడు నాదల్​.

ఫ్రెంచ్​ ఓపెన్​లో వరుసగా 36 సెట్ల విజయాలను అందుకున్నాడు నాదల్. ఈ మ్యాచ్​లో రెండో సెట్​ను కోల్పోవడం ద్వారా ఈ సెట్​ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. గతంలో 2016-18 సీజన్​లో వరుసగా 38 సెట్ల విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు రఫా. ఫ్రెంచ్​ ఓపెన్​లో వరుసగా 41 సెట్లను గెలుపొందిన రికార్డు జోర్న్​ బోర్గ్​ పేరిట ఉంది.

ఇదీ చదవండి: French Open నుంచి ఫెదరర్​ నిష్క్రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.