ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో అయిదుసార్లు ఛాంపియన్ అయిన నొవాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. ఈ సెర్బియా స్టార్‌కు ఝలక్ ఇస్తూ రష్యా కెరటం డానియల్ మెద్వెదెవ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-3, 6-3తో నొవాక్‌ను ఓడించాడు.
ఈ మ్యాచ్‌లో ఓడినా సెమీస్ చేరేందుకు నొవాక్‌కు ఇంకా అవకాశం ఉంది. అందుకు అతను శుక్రవారం జరిగే పోరులో మాజీ ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాలి. మరో గ్రూప్ మ్యాచ్‌లో రుబ్‌లెవ్ (రష్యా) 6-2, 7-5తో డొమినిక్ థీమ్ (కెనడా)ను ఓడించాడు. అయితే ఈ పోరులో ఓడినా థీమ్‌కు ఇబ్బంది లేదు. అతను ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించాడు. ఈ గ్రూప్ నుంచి మరో సెమీస్ బెర్తు కోసం సిట్సిపాస్‌తో నాదల్ శుక్రవారం పోటీపడనున్నాడు.