భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పునరాగమనంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. రెండేళ్ల తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ భామ.. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీఫైనల్ చేరింది.
గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా- నదియా (ఉక్రెయిన్) 6-2, 4-6, 10-4 తేడాతో వేనియా కింగ్- క్రిస్టినా మెక్‌హేల్(ఆసీస్ ద్వయం)పై నెగ్గారు. ఈ మ్యాచ్ గంట 24 నిముషాల పాటు జరిగింది. తర్వాత మ్యాచ్‌లో తమరా జిడన్సెక్(స్లోవేనియా)-మారి బోజ్కోవా(చెక్ రిపబ్లిక్) జంటతో తలపనుంది సానియా జోడీ.
ఈ టోర్నీకి ముందు సానియా మీర్జా 2017 అక్టోబరులో చైనా ఓపెన్ ఆడింది. మోకాలి గాయం.. ఆ తర్వాత బిడ్డ ఇషాన్‌కు జన్మనివ్వడం కారణంగా ఆమె రెండేళ్లకుపైగా ఆటకు దూరమైంది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించేందుకు తీవ్రంగా కసరత్తులు చేసి ఫిట్నెస్ మెరుగుపర్చుకుందీ 33 ఏళ్ల స్టార్ ప్లేయర్.