భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన చివరి డేవిస్ కప్ మ్యాచ్ ఆడబోతున్నాడు! ఈ ఏడాదే ఆటకు వీడ్కోలు పలుకుతానని గతంలోనే ప్రకటించిన పేస్.. క్రొయేషియాతో డేవిస్‌కప్ ప్లేఆఫ్స్ పోరులో భారత్ తరపున డబుల్స్‌లో పోటీపడబోతున్నాడు. ఇందులో భారత్ గెలిస్తే నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. అప్పటి వరకూ పేస్ ఆటలో కొనసాగేది అనుమానమే కాబట్టి అతనికి ఇదే చివరి డేవిస్ కప్ మ్యాచ్ కావొచ్చు. డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి పేస్ ఆడనున్నాడు.
-
Inspiring words from @Leander...
— Davis Cup (@DavisCup) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
“For me to especially play for India, a country that’s got 1.4 billion people, it’s a big responsibility and the greatest honour of my life” ❤️
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
🎥 @AITA__Tennis
pic.twitter.com/snqUlOdL5d
">Inspiring words from @Leander...
— Davis Cup (@DavisCup) March 5, 2020
“For me to especially play for India, a country that’s got 1.4 billion people, it’s a big responsibility and the greatest honour of my life” ❤️
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
🎥 @AITA__Tennis
pic.twitter.com/snqUlOdL5dInspiring words from @Leander...
— Davis Cup (@DavisCup) March 5, 2020
“For me to especially play for India, a country that’s got 1.4 billion people, it’s a big responsibility and the greatest honour of my life” ❤️
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
🎥 @AITA__Tennis
pic.twitter.com/snqUlOdL5d
46 ఏళ్ల పేస్.. డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (44) నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌లో భారత నం.1 ఆటగాడు సుమిత్‌ను కాకుండా రామ్‌కుమార్‌ను ఆడించాలని జట్టు నిర్ణయం తీసుకుంది. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ పాల్గొనున్నాడు. క్రొయేషియా జట్టులో ఉత్తమ ర్యాంకు ఆటగాడు బోర్నా కొరిచ్ (33) మ్యాచ్‌కు దూరమవడం భారత్‌కు సానుకూలాంశం. బలమైన ప్రత్యర్థిపై విదేశాల్లో భారత్ విజయం సాధించి చాలా కాలమైంది. గతంలో సెర్బియా (2018), కెనడా (2017) చేతిలో జట్టు ఓడింది.