ETV Bharat / sports

ప్లిస్కోవా కథ ముగిసె.. కెనిన్‌, జకోవిచ్‌ ముందంజ

ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో రెండో సీడ్ ప్లిస్కోవా.. మాజీ ఛాంఫియన్​ ఒస్టాపెంకో చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు కెనిన్​, క్విటోవా విజయం సాధించారు. కాగా, పురుషుల సింగిల్స్​లో టాప్​సీడ్​ జకోవిచ్​ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.

French Open
ఫ్రెంచ్​ ఓపెన్
author img

By

Published : Oct 2, 2020, 6:33 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ప్లిస్కోవా కథ ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ ఛాంపియన్‌ ఒస్టాపెంకో ఆమెను చిత్తుగా ఓడించింది. మరోవైపు కెనిన్‌, క్విటోవా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్‌ షపోవలోవ్‌ ఇంటి ముఖం పట్టాడు. టాప్‌సీడ్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.

fliscova
ప్లిస్కోవా

మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ కరోలిన ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు షాక్‌. గురువారం రెండో రౌండ్లో ఈ ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ 4-6, 2-6 తేడాతో ఒస్టాపెంకో (లాత్వియా) చేతిలో పరాజయం పాలైంది. 2017లో అన్‌సీడెడ్‌గా బరిలో దిగి టైటిల్‌ ఎగరేసుకుపోయిన ఒస్టాపెంకో మళ్లీ అప్పటిలా చెలరేగి ఆడుతోంది. గత రెండుసార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన ఈ లాత్వియా అమ్మాయి ప్లిస్కోవాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ కెనిన్‌ (అమెరికా) 3-6, 6-3, 6-2తో బోగ్డాన్‌ (రొమేనియా)పై గెలిచింది. తొలి సెట్‌లో తడబడి ఓడిన ఆమె.. తర్వాత పుంజుకుని వరుసగా రెండు సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 6-3తో పావొలిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్‌ సబలెంక (బెలారస్‌) 7-6 (8-6), 6-0తో డారియా కసత్కిన (రష్యా)పై గెలిచారు. మరోవైపు స్టీఫెన్స్‌ (అమెరికా) 4-6, 6-4, 2-6తో బడోసా (స్పెయిన్‌) చేతిలో ఓడింది.

ostapenko
ఒస్టాపెంకో

హోరాహోరీ పోరు: ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో షపోవలోవ్‌ (కెనడా) 5-7, 7-6 (7-5), 3-6, 6-3, 6-8తో రాబర్టో (స్పెయిన్‌) చేతిలో ఓడాడు. ప్రపంచ 11వ ర్యాంకర్‌ షపోవలోవ్‌తో పోరులో 101వ ర్యాంకర్‌ రాబర్టో అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు. అయిదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్‌లో షపోవలోవ్‌ రెండు సార్లు మ్యాచ్‌ కోసం సర్వ్‌ చేశాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లో 5-4తో.. ఆ తర్వాత 6-5తో ఆధిక్యంలో ఉన్నా అతడు సద్వినియోగం చేసుకోలేదు. గొప్ప తెగువ ప్రదర్శించిన రాబర్టో చివర్లో వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. 106 అనవసర తప్పిదాలతో షపోవలోవ్‌ మూల్యం చెల్లించుకున్నాడు. ఓ గ్రాండ్‌స్లామ్‌లో మూడో రౌండ్‌కు చేరడం, అయిదు సెట్ల మ్యాచ్‌ ఆడడం, టాప్‌-10 ఆటగాణ్ని ఓడించడం రాబర్టోకిదే తొలిసారి. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ (సెర్బియా) 6-1, 6-2, 6-2తో బెరాంకిస్‌ (లిథువేనియా)ను చిత్తుచేసి మూడో రౌండ్‌ చేరాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జకో 10 ఏస్‌లు, 25 విన్నర్లు కొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-4, 7-6 (7-5), 6-1తో మార్టిన్‌ (స్లోవేకియా)పై, కచనోవ్‌ (రష్యా) 6-1, 6-7 (4-7), 7-6 (9-7), 7-6 (7-2)తో వెస్లీ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచారు. పాబ్లో (స్పెయిన్‌), సిట్సిపాస్‌ (గ్రీస్‌) గారిన్‌ (చిలీ) కూడా ముందంజ వేశారు.

jakovich
జకోవిచ్‌

బోపన్న ఔట్‌: పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న జోడీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. బోపన్న-షపవ్‌లోవ్‌ 2-6, 2-6తో పోస్‌పిసిల్‌ (కెనడా)-సాక్‌ (అమెరికా) చేతిలో వరుస సెట్లలో ఓడారు. దివిజ్‌ శరణ్‌, వాన్‌ సూన్‌ (దక్షిణ కొరియా) జోడీ 2-6, 6-4, 4-6తో 16వ సీడ్‌ ఫ్రాంకో (క్రొయేషియా)- ఆస్టిన్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.

ఇదీ చూడండి ఐపీఎల్: చెన్నైXహైదరాబాద్​..గెలుపు ఎవరిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.