ఫ్రెంచ్ ఓపెన్‌ను కుండపోత వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కురవడం వల్ల బుధవారం జరగాల్సిన క్వార్టర్స్ మ్యాచ్‌లు ఈరోజు జరగనున్నాయి.
- పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో, థీమ్.. కచనోవ్‌తో తలపడాల్సి ఉంది. ఇప్పటికే నాదల్, ఫెదరర్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్.. అనిసిమోవా (అమెరికా)తో తలపడనుంది. మాడిసన్ కీస్ (అమెరికా)... బార్టీ (ఆస్ట్రేలియా)తో పోటీపడనుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం నిర్వహిస్తుండడం వల్ల హలెప్ తుదిపోరుకు చేరాలంటే వరుసగా మూడు రోజులు విశ్రాంతి లేకుండా ఆడాల్సి ఉంటుంది. ఆమె గురువారం - క్వార్టర్స్, శుక్రవారం- సెమీస్, శనివారం- ఫైనల్ పోరులో ఆడాల్సి ఉంటుంది. వర్షం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక్క మ్యాచ్ జరగకుండానే రోజంతా వృథా కావడం 2000 తర్వాత ఇది మూడోసారి. 2016లోనూ వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
-
All matches cancelled for today, 5 June 2019, at Roland-Garros: tickets fully refunded. More info ➡️ https://t.co/NunoS7oiAx #RG19 pic.twitter.com/WYWgl8nYe6
— Roland-Garros (@rolandgarros) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All matches cancelled for today, 5 June 2019, at Roland-Garros: tickets fully refunded. More info ➡️ https://t.co/NunoS7oiAx #RG19 pic.twitter.com/WYWgl8nYe6
— Roland-Garros (@rolandgarros) June 5, 2019All matches cancelled for today, 5 June 2019, at Roland-Garros: tickets fully refunded. More info ➡️ https://t.co/NunoS7oiAx #RG19 pic.twitter.com/WYWgl8nYe6
— Roland-Garros (@rolandgarros) June 5, 2019