అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్(Serena Williams)కు షాక్! మార్గరెట్ కోర్ట్ (24 టైటిళ్ల) రికార్డును సమం చేయాలన్న ఆమె ప్రయత్నానికి మరోసారి బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్వ(French Open)లో సెరెనా పోరాటం ప్రీక్వార్టర్స్‌కే పరిమితమైంది. సెరెనా ఆశలకు గండికొడుతూ ఎలీనా రిబకినా (Rybakina) (ఉక్రెయిన్) సంచలన విజయం సాధించింది. ప్రీక్వార్టర్స్‌లో 21వ సీడ్ ఎలీనా 6-3, 7-5తో ఏడో సీడ్ విలియమ్స్‌ను ఓడించింది.
తొలి సెట్ కోల్పోయినా.. రెండో సెట్లో పోరాడిన సెరెనా ఒక దశలో 5-5తో స్కోరు సమం చేసింది. కానీ పదకొండో గేమ్‌లో సర్వీస్ కోల్పోయిన విలియమ్స్.. ఆ తర్వాత సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఐదుసార్లు సర్వీస్ కోల్పోయి, 19 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా ఓటమి కొనితెచ్చుకుంది.