ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్: అజరెంక ఔట్​.. నాదల్​, హలెప్​ ముందంజ

ఇటీవల యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్​కు చేరి, ఏడేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరుకు అర్హత సాధించిన అజరెంక.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. సింగిల్స్‌ రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.

french open
అజరెంక
author img

By

Published : Oct 1, 2020, 6:54 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పదో సీడ్‌ అజరెంక (బెలారస్‌) కథ ముగిసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్​లో ఆమె 2-6, 2-6 తేడాతో అన్నా కరోలిన (స్లోవేకియా) చేతిలో చిత్తయింది. తొలిరౌండ్​లో మాజీ నంబర్‌వన్‌ వీనస్‌ విలియమ్స్‌కు షాకిచ్చిన 161వ ర్యాంకర్‌ కరోలిన.. అదే దూకుడు కొనసాగించి 14వ ర్యాంకర్‌ అజరెంకను ఓడించడం విశేషం. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది కరోలిన. పదునైన ఏస్‌లు, బలమైన సర్వీసులతో చెలరేగి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరులో తొలి సెట్‌ను గెలుచుకుంది.

రెండో సెట్‌లోనూ అజరెంకపై కరోలిన ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో కరోలిన 17 విన్నర్లు కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో అయిదో సీడ్‌ బెర్టీన్స్‌ (నెదర్లాండ్స్‌) 7-6 (7-5), 3-6, 9-7తో సారా (ఇటలీ)పై కష్టపడి నెగ్గింది. ఈ మ్యాచ్‌ 3 గంటల 11 నిమిషాల పాటు సాగింది. టైబ్రేకర్‌లో ఫలితం తేలిన తొలి సెట్‌ను బెర్టీన్స్‌ గెలిచింది. కానీ రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్న ప్రత్యర్థి.. బెర్టీన్స్‌కు షాకిచ్చింది.

french open
అజరెంక

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో పోరాటం మరో స్థాయికి చేరింది. 16 గేమ్‌ల పాటు సాగిన ఆ సెట్​లో ప్రత్యర్థికి రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్‌ గెలిచే అవకాశమివ్వని బెర్టీన్స్‌.. చివరకు బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో విజయం సాధించింది. టాప్‌సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 6-3, 6-4తో తన దేశానికే చెందిన కమేలియాపై గెలిచింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. హలెప్‌ మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 15 విన్నర్లు కొట్టింది.

ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-3, 0-6, 6-2తో జరాజువా (మెక్సికో)పై, సకారి (గ్రీస్‌) 7-6 (7-0), 6-2తో రఖిమోవా (రష్యా)పై, మార్టిన్స్‌ (బెల్జియం) 6-4, 7-5తో కనెపి (ఇస్తోనియా)పై నెగ్గారు. 23వ సీడ్‌ పుతింత్సెవ (కజకిస్థాన్‌) 3-6, 6-1, 2-6తో నదియా (అర్జెంటీనా) చేతిలో ఓడింది. అనిసిమోవ (అమెరికా) కూడా ముందంజ వేసింది.

french open
నాదల్​

రఫెల్‌ జోరు:

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్​లో అతను 6-1, 6-0, 6-3తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించాడు. ప్రత్యర్థికి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయిన అతను గంటా 40 నిమిషాల్లో మ్యాచ్‌ ముగించాడు. తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టి కోర్టులో చెలరేగిన రెండో సీడ్‌ నాదల్‌ మ్యాచ్‌లో 31 విన్నర్లు కొట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-1, 6-3, 7-6 (8-6)తో జాక్‌ సాక్‌ (అమెరికా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6-3, 6-2, 3-6, 6-1తో కోఫర్‌ (జర్మనీ)పై గెలిచారు. ఇస్నర్‌, ఫ్రిట్జ్‌, ష్వార్జ్‌మన్‌, రూడ్‌ కూడా ముందంజ వేశారు.

మ్యాచ్‌కు ముందే:

మాజీ నంబర్‌వన్‌ సెరెనా గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాలి మడమ గాయంతో బాధపడుతోన్న ఆమె పిరంకోవాతో రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మూడు వారాల క్రితం యుఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో గాయపడ్డ తను పూర్తిగా కోలుకోకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో దిగింది.

"నడవడానికి ఇబ్బంది పడుతున్నా. కాలి మడమ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సినంత సమయం దొరకలేదు. ఈ గాయం పూర్తిగా తగ్గడానికి కనీసం ఆరు వారాలైనా పట్టేలా ఉంది. అప్పటివరకూ ఖాళీగా ఉండాల్సిందే" అని సెరెనా తెలిపింది. తను ఇప్పటివరకూ మూడుసార్లు (2002, 2013, 2015) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.