ఎర్రమట్టి కోర్టు రారాజుగా 12వ సారి ఘనత సాధించాలని ఊవిళ్లూరుతున్న రఫెల్ నాదల్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించాడు నాదల్.
సెమీస్‌లో స్విస్ దిగ్గజం ఫెదరర్‌పై 6-3, 6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించాడు రఫా. ఫలితంగా కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్ టైటిల్ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
- జూన్ 9న జరగనున్న ఫైనల్లో అతడు ప్రపంచ నంబర్ 1 నొవాక్ జకోవిచ్- డొమినిక్ థీమ్ మధ్య సెమీస్ మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.
తిరుగులేని ఛాంపియన్...
2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన నాదల్... 2006, 2007, 2008 టైటిళ్లతో కలిపి నాలుగు సార్లు వరుస ఛాంపియన్‌గా అవతరించాడు. ఇందులో మూడు సార్లు ఫెదరర్ ఫైనల్లో తలపడి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం.
-
22 not out!@RafaelNadal secures a 6-3 6-4 6-2 win over rival Federer, and his 22nd match win in a row at Roland-Garros…
— Roland-Garros (@rolandgarros) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🎾 https://t.co/nKZ3xJ2F6o#RG19 pic.twitter.com/zIMYOPkEWN
">22 not out!@RafaelNadal secures a 6-3 6-4 6-2 win over rival Federer, and his 22nd match win in a row at Roland-Garros…
— Roland-Garros (@rolandgarros) June 7, 2019
🎾 https://t.co/nKZ3xJ2F6o#RG19 pic.twitter.com/zIMYOPkEWN22 not out!@RafaelNadal secures a 6-3 6-4 6-2 win over rival Federer, and his 22nd match win in a row at Roland-Garros…
— Roland-Garros (@rolandgarros) June 7, 2019
🎾 https://t.co/nKZ3xJ2F6o#RG19 pic.twitter.com/zIMYOPkEWN
- రఫెల్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ 2009లో ఫెదరర్ టైటిల్ గెలవగా.. 2010 నుంచి 2014 వరకు మరో ఐదు సార్లు విజేతగా నిలిచాడు రఫా. ఈ ఐదింటిలో రెండు సార్లు జకోవిచ్, ఒక్కసారి ఫెదరర్‌తో ఫైనల్లో పోటీ పడ్డాడు స్పెయిన్ బుల్.
2017, 2018లోనూ టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన నాదల్ ఈ ఏడాదీ ఫైనల్‌కు చేరాడు.
- 2005 నుంచి 2018 వరకు (2009, 2015, 2016 మినహా) అన్ని టైటిళ్లు వరుసగా గెలిచి ఎర్రమట్టి కోర్టులో తిరుగులేని ఆటగాడిగా ఘనత సాధించాడు.
- ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు గెలవగా కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయాడు నాదల్. ఇందులో ఆరుసార్లు రోజర్‌ను ఓడించాడు.
" రోజర్‌తో ఆడటం అద్భుతం. అతడికి అభినందనలు. 37 ఏళ్ల వయసులోనూ ఇలా ఆడటం మామూలు విషయం కాదు. మరో ఫైనల్ చేరుకున్నందుకు పారిస్ అభిమానులకు ధన్యవాదాలు. ఫెదరర్‌తో ఆడటం నాకెప్పుడూ సంతోషం, సంక్లిష్టం ".
-- రఫెల్ నాదల్, స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం
ఇవీ చూడండి: