ETV Bharat / sports

లాక్​డౌన్​తో ఆనందంగా ఉన్న టెన్నిస్ ప్లేయర్లు! - Roger Federer latest news

లాక్​డౌన్​తో దొరికిన విరామం వల్ల ఆటగాళ్లందరూ ఆనందంగా ఉన్నారని ఫెదరర్ చెప్పాడు. ఈ విషయమై స్పందించిన మరో టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ హారిస్.. ఫెదరర్ వ్యాఖ్యలపై విమర్శలు చేశాడు.

Federer says most of the tennis players are happy with lockdown
ఫెదరర్
author img

By

Published : Jul 31, 2020, 10:08 PM IST

కరోనా వల్ల వచ్చిన లాక్​డౌన్​తో టెన్నిస్ ప్లేయర్లు దాదాపు ఆనందంగా ఉన్నారని అంటున్నాడు దిగ్గజ క్రీడాకారుడు​ రోజర్​ ఫెదరర్. ఏడాది మొత్తం టోర్నీలతో బిజీగా ఉండే వాళ్లకు ఇప్పుడు చాలా విశ్రాంతి లభించిందని చెప్పాడు. గాయాలు కావడం వల్ల ఈ సంవత్సరం ఎలాంటి పోటీల్లోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. టెన్నిస్​ రాకెట్​ పట్టుకునేది వచ్చే ఏడాదేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

"20 ఏళ్లుగా పర్యటనల్లో మునిగితేలుతున్న నాకు దొరికిన ఈ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాను. కొంతమంది బలవంతంగా ఇంట్లో ఉన్నప్పటికి.. లాక్​డౌన్​తో 90 శాతం మంది ఆటగాళ్లు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే టెన్నిస్​ షెడ్యూల్స్​ అనేవి నిర్విరామంగా ఉంటాయి" అని ఫెదరర్ అన్నాడు.

అయితే లాక్​డౌన్​తో కొందరు క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా టెన్నిస్​ ఆటగాడు ఆండ్రూ హారిస్​. ఫెదరర్​ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలా మాట్లాడాడు.

"ఫెదరర్​ సంపన్నుడని నాకు తెలుసు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులకు సాయం చేస్తానని అతడు బహిరంగంగా ప్రకటించొచ్చు. కానీ, అలా చేయడు. ఎందుకంటే ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండటమే అతడికి ముఖ్యం" అని ఆండ్రూ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.