టెన్నిస్ ప్రపంచంలో ప్రస్తుతం ఫెదరర్, నాదల్, జకోవిచ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు ఎక్కువ కాలం నెంబర్ వన్‌గా ఉన్న ఆటగాడిగా ఫెదరర్ పేరిట రికార్డులు ఉన్నాయి. అయితే కచ్చితంగా ఈ రెండు రికార్డులను తాను అధిగమిస్తానని స్పష్టం చేస్తున్నాడు సెర్బియా స్టార్ జకోవిచ్.
"నాలో ఇంకా ఆట మిగిలే ఉంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం, ఎక్కువ కాలం నెంబర్‌వన్‌గా కొనసాగడం నా ముందున్న లక్ష్యాలు. ఈ రెండింటిని సాధిస్తానని నమ్ముతున్నా."
-జకోవిచ్, టెన్నిస్ ఆటగాడు
ప్రస్తుతం జకోవిచ్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, నాదల్ 19 టైటిల్స్‌తో అతడి వెనకాలే ఉన్నాడు.
ఎక్కువ వారాలు నెంబర్‌వన్‌గా ఉన్న రికార్డు కూడా ఫెదరర్ పేరిటే ఉంది. వరుసగా ఇతడు 310 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. అతడి తర్వాత మాజీ ఆటగాడు సంప్రాస్ 286 వారాలు నెంబర్‌వన్‌గా ఉన్నాడు.