పాకిస్థాన్ - భారత్ మధ్య మ్యాచ్ అంటే.. ఎంతో క్రేజ్. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఏ ఆటైనా అంతే కసితో విజృంభిస్తారు మన ఆటగాళ్లు. తాజాగా డేవిస్ కప్‌లోనూ భారత టెన్నిస్ ప్లేయర్లు దూకుడు చూపించారు. తటస్థ వేదికైన కజకిస్థాన్‌లో జరుగుతున్న పోరులో 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది భారత్. యువ క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్ సత్తాచాటారు.
రామనాథన్, నాగల్ విజయ భేరి..
మొదట జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామనాథన్ 6-0, 6-0తో మహ్మద్ షోయబ్ (17 ఏళ్లు)ను చిత్తుగా ఓడించాడు. కేవలం 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. కేవలం రెండో సెట్ ఆరో గేమ్‌లో మాత్రమే రామనాథన్‌కు షోయబ్ కాస్త పోటీనిచ్చాడు.
అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ నగాల్ డేవిక్‌కప్‌లో తొలి విజయం నమోదు చేశాడు. రెండో సింగిల్స్‌లో హఫైజా మహ్మద్ రెహ్మాన్‌ను 6-0, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఈ పోరు కాస్త ఆసక్తికరంగా సాగింది.
-
India 🇮🇳 have established a commanding position after the first day of play in Nur-Sultan👀
— Davis Cup (@DavisCup) November 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full report ⬇️https://t.co/Dpzv8CBC5r#DavisCup #PAKIND pic.twitter.com/tR9KKYUWG3
">India 🇮🇳 have established a commanding position after the first day of play in Nur-Sultan👀
— Davis Cup (@DavisCup) November 29, 2019
Full report ⬇️https://t.co/Dpzv8CBC5r#DavisCup #PAKIND pic.twitter.com/tR9KKYUWG3India 🇮🇳 have established a commanding position after the first day of play in Nur-Sultan👀
— Davis Cup (@DavisCup) November 29, 2019
Full report ⬇️https://t.co/Dpzv8CBC5r#DavisCup #PAKIND pic.twitter.com/tR9KKYUWG3
ఇందులో గెలిస్తే పేస్ రికార్డు..
శనివారం జరిగే డబుల్స్‌లో హఫైజా, షోయబ్ ద్వయంతో లియాండర్ పేస్, అరంగేట్ర ఆటగాడు జీవన్ నెడుంచెళియన్ జోడీ తలపడనుంది. ఇందులో గెలిస్తే డేవిస్ కప్ డబుల్స్ చరిత్రలో అత్యధిక విజయాల ఘనత పేస్‌కు దక్కుతుంది. ఇప్పటికే 43 విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ టైలో గెలిచిన జోడి ప్రపంచ గ్రూప్ అర్హత పోటీల కోసం క్రొయేషియా వెళ్తుంది.
పాక్ సీనియర్లు దూరం..
తమ దేశంలో కాకుండా తటస్థ వేదికలో మ్యాచ్ నిర్వహిస్తున్నందుకు నిరసనగా పాక్ సీనియర్ ఆటగాళ్లు ఈ టైకి దూరమయ్యారు. డేవిస్ కప్ టైలో పాక్‌తో భారత్ ఆరుసార్లు తలపడగా.. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. డేవికప్ టైలో మహిళల ప్రాతినిధ్యం ఉండదు. ఒక దేశంతో తలపడేటప్పుడు మొత్తం ఐదు మ్యాచులు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ 4, డబుల్స్ ఒకటి ఉంటాయి.
ఇదీ చదవండి: 'పదేళ్లయినా.. చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి'