ETV Bharat / sports

Davis Cup: భారత్​ వేదికగా డేవిస్​ కప్​ టోర్నీ - టెన్నిస్​ న్యూస్

Davis Cup India: భారత్​ వేదికగా వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రతిష్ఠాత్మక డేవిస్​ కప్​ మ్యాచ్​లు జరగనున్నాయి. 2019 తర్వాత మరోసారి భారత్​ వేదికగా ఈ టెన్నిస్​ టోర్నీ జరగడంపై ఇండియా కోచ్​ హర్షం వ్యక్తం చేశారు.

Davis Cup
భారత్​ వేదికగా డేవిస్​ కప్​ టోర్నీ
author img

By

Published : Dec 6, 2021, 7:28 PM IST

Davis Cup India: ప్రతిష్ఠాత్మక టెన్నిస్​ టోర్నీ.. డేవీస్​ కప్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది మార్చి 4-5 తేదీల్లో మ్యాచ్​లు జరగనున్నాయి. అయితే టోర్నీ మొత్తం భారత్​లో జరగదు. కేవలం కొన్ని ఎలిమినేటర్​ మ్యాచ్​లే జరుగుతాయి. ఇందులో భాగంగా డెన్మార్క్​తో భారత్​ తలపడనుంది. 2019 తర్వాత డేవిస్​ కప్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఏ పట్టణంలో ఈ మ్యాచ్​లు నిర్వహిస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

భారత్​ వేదికగా డేవిస్​ కప్​ మ్యాచ్​లు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు ఇండియా జట్టు కోచ్​ జీషన్​ అలీ. చాలారోజుల నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై మ్యాచ్​ నిర్వహించే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్స్​ గమనిస్తే డెన్మార్క్​తో జరగనున్న మ్యాచ్​ భారత్​కు సవాల్​గా మారిందన్నారు.

2019 ఫిబ్రవరిలో కోల్​కతా వేదికగా ఇండియా-ఇటలీల మధ్య మ్యాచ్​ జరిగింది. అందులో భారత్​ 1-3తో ఓడిపోయింది.

డేవిస్​ కప్​ టోర్నీలో డెన్మార్క్-భారత్​లు రెండుసార్లు తలపడ్డాయి. 1984 సెప్టెంబరులో ఆర్హస్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో డెన్మార్క్​పై 3-2తో భారత్​ విజయం సాధించింది. 1927లో కోపెహగన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో ​భారత్​ను 5-0తో డెన్మార్క్​ వైట్​వాష్​ చేసింది.

ఇదీ చూడండి : Peng Shuai Missing: చైనాకు డబ్ల్యూటీఏ షాక్‌..పెంగ్‌ ఆచూకీ కోసం డిమాండ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.