ఒలింపిక్స్‌లో పాల్గొనే అతిపిన్న వయస్కురాలైన(గత 20 ఏళ్లలో) టెన్నిస్ ప్లేయర్‌గా ఘనత సాధించాల్సిన అమెరికా యువ సంచలనం కొకో గాఫ్‌కు నిరాశే ఎదురైంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల ఈసారి ఆడలేకపోతున్నానని ఈమె ఆదివారం వెల్లడించింది.
"కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో ఆడట్లేదని చెప్పడానికి బాధగా ఉంది. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. అది నిజం చేసుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా."
-కొకో గాఫ్, అమెరికా టెన్నిస్ ప్లేయర్
కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన విశ్వక్రీడలు.. ఈ శుక్రవారం(జులై 23) నుంచి ఆరంభం కానున్నాయి. వైరస్ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ల్ ప్లేయర్లు రఫెల్ నాదల్, ఫెదరర్, సెరెనా విలియమ్స్, సిమోనా హలెప్, డొమినిక్ థీమ్, వావ్రింకా, నిక్ కిర్గోస్ ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చూడండి: Olympics: ఆ చిన్నారి కోసం ఒలింపిక్స్‌కు జకోవిచ్